Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Political

నంద్యాల

రైతుల కష్టాలు కూటమికి పట్టవా?: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధ్వజం

నంద్యాల:శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 873 అడుగుల నీటి నిల్వలు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతానికి నీటిని విడుదల చేయకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం నంద్యాల మండలం కానాల చెరువును స్థానిక నాయకులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా నష్టాల్లో ఉన్న రైతులకు ఈ ఏడాదైనా నీళ్లు వస్తాయనే ఆశ అడియాశగా మారిందన్నారు. పంటలు సాగు చేయవద్దని చెబుతున్న అధికారులు, రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 90 శాతం పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పనులను కూటమి ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని ఆరోపించారు. ‘అన్నదాత సుఖీభవ’, ఉచిత పంటల ఇన్సూరెన్స్ పథకాలు అమలు కావడం లేదని మండిపడ్డారు. కానాల చెరువులో మట్టి తవ్వకాలపై అధికారులు తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, తాగు, సాగు నీరు వెంటనే విడుదల చేసి రాయలసీమ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నంద్యాల

పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందజేయడమే నిజమైన ప్రజాసేవ: మంత్రి ఫరూక్

గోస్పాడు / యాళ్లూరు:పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం అభినందనీయమని రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం యాళ్లూరు గ్రామంలో విశ్రాంత పీఎఫ్ కమిషనర్ కైప శివరామిరెడ్డి ఆధ్వర్యంలో వారి పూర్వీకుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.పదవీ విరమణ పొందినా సొంత ఊరి ప్రజల ఆరోగ్యం కోసం శివరామిరెడ్డి ఉచిత శిబిరం నిర్వహించడం ఆదర్శనీయమని మంత్రి కొనియాడారు. ఈ శిబిరంలో ప్రముఖ స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల వైద్య నిపుణులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నంద్యాల

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, హైకోర్టు బెంచ్‌పై మంత్రి ఫరూక్‌తో బార్ అసోసియేషన్ భేటీ

నంద్యాల బార్ అసోసియేషన్ ప్రతినిధులు, కర్నూలు జిల్లా జేఏసీ నాయకులు, అనంతపురం, కర్నూలు బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు ఆదివారం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను నంద్యాలలో కలసి పలు కీలక అంశాలపై చర్చించారు. న్యాయవాదుల భద్రత కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ అమలు చేయాలని, అలాగే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నలుగు కార్యక్రమం లో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ0 కొండాపురం గ్రామంలో టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ పోలినేని రమేష్ వెంకటరతమ్మ దంపతుల కుమారుడు రవి కిషోర్ గంధపు నలుగు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరైన నూతన వరుడునీ ఘనంగా ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో నాయకుల రాకతో స్థానికంగా సందడి నెలకొంది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దగదర్తి కట్టుబడిపాలెం గ్రామంలో రెడ్డి గుంట చెరువు కట్ట అభివృద్ధి పనులు

ఈరోజుఉదయందగదర్తి మండలం చెన్నూరు పంచాయితీలోని కట్టుబడిపాలెం గ్రామ పంచాయతీలోఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలమేరకు దగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి గారు కట్టుబడిపాలెం గ్రామములో గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో రెడ్డి గుంట చెరువు కట్ట 8,50,000/-రూపాయలతో అభివృద్ధి పనులకు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమములో కట్టుబడిపాలెం నీటి సంఘ అధ్యక్షులు వేముల శ్రీధర్ వేముల బ్రాహ్మయ్య వేముల వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు గున్నం రెడ్డి హరికిశోర్ రెడ్డి పాపన మల్లికార్జున రెడ్డి కాకాని రాజావినోద్ రైతులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి మాజీ ఎంపీపీ దామిశెట్టి శాంతమ్మ మృతి

కావలి మండలం మాజీ ఎంపీపీ దామిశెట్టి శాంతమ్మ శనివారం రాత్రి అనారోగ్యం మృతి శాంతమ్మ సర్యాయ పాలెం ఎం.పీ.టీ.సీ గా కావలి మండల జడ్పిటిసిగా కావలి మండల అధ్యక్షురాలుగా ఎన్నో రాజకీయ పదవులు నిర్వహించారు.కావలి మండలం ఆమె స్వగ్రామం సర్యాయ పాలెం లో మధ్యాహ్నం 2 గంటల పైన అంతక్రియలు జరుగుతాయని తెలిపిన కుటుంబ సభ్యులు

నంద్యాల

కూటమి పాలనలో వ్యవసాయం ధ్వంసం: శిల్పా రవి

నంద్యాల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విమర్శించారు. శనివారం నంద్యాలలోని తన నివాసంలో రాయలసీమ రైతాంగ సమస్యలపై రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు.సకాలంలో సాగునీరు అందక, పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, సాగునీటి సాధన కోసం సెప్టెంబర్ 1వ తేదీన వెలుగోడు రిజర్వాయర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమానికి రైతులు, రైతు సంఘం నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు పీపీ నాగిరెడ్డి, నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, రైతు నాయకులు అరికట్ల శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

కుంటలు, చెరువులు ఎండిపోతున్నాయి… దిగువకు నీరు వదలరా?: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి

వర్షాభావం వల్ల పంటలకు, తాగడానికి నీరు లేక ప్రజలు, పశువులు ఇబ్బందులు పడుతున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల మండలంలోని మిట్నాల కుంటను, చిన్నచెరువును ఆయన శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 24 ఏళ్ల తర్వాత మిట్నాల కుంట ఎండిపోవడం ఘోరమని, కలెక్టర్ ఆఫీస్‌కు అతి సమీపంలో ఉన్న గ్రామానికే నీరు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నాయని చెబుతున్న కూటమి ప్రభుత్వం, దిగువకు నీటిని ఎందుకు విడుదల చేయడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తక్షణమే సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

నంద్యాల

వైఎస్సార్ నగర్‌లో త్వరలోనే నూతన రహదారుల నిర్మాణం: టీడీపీ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్

నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వైఎస్సార్ నగర్‌లో త్వరలోనే నూతన రోడ్ల నిర్మాణం చేపడతామని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండీ ఫయాజ్ తెలిపారు. శనివారం తాటికొండ బుగ్గ రాముడు ఆధ్వర్యంలో ఆయన వార్డులోని పలు వీధులు, రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ నగర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. త్వరలోనే నిధులు సమకూర్చి, నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజల రాకపోకల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్ బాబు, మరాఠీ సూరి, దీపక్ రెడ్డి, షబ్బీర్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు

నంద్యాల

విజన్ ప్లాన్ అమలుకు సీఎం ఆదేశం

నంద్యాల :రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య పాల్గొన్నారు. పేదల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల అమలుపై సమీక్షించిన సీఎం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.