వార్త ముఖ్యాంశాలు
- 15 నుంచి నామినేషన్లు..
- 26న పోలింగ్, అదే రోజు ఫలితాలు వరికుంటపాడు: మండలంలోని గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
- ఈ నెల 15న నోటీసు జారీతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 17 వరకు కొనసాగుతుంది.
15 నుంచి నామినేషన్లు.. 26న పోలింగ్, అదే రోజు ఫలితాలు
వరికుంటపాడు: మండలంలోని గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 15న నోటీసు జారీతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 17 వరకు కొనసాగుతుంది. 18న నామినేషన్ల పరిశీలన, 19న అప్పీళ్ల స్వీకరణ, 20న పరిష్కారం చేపడతారు. 21న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 26న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. షెడ్యూల్తో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు స్థానాల కోసం ఆశావహులు ఇప్పటి నుంచే ప్రజలను కలుస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.