కావలిజమ్మలపాలెంలోని కె.వి.ఆర్. కన్వెన్షన్‌లో జరిగిన కలిగిరి మాజీ మండల అధ్యక్షులు, కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ మెట్టుకూరు రామిరెడ్డి, శ్రీమతి భారతమ్మ దంపతుల మనుమరాలు సౌ. జోషిత రెడ్డి వివాహ మహోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.



