Thursday, 3 September 2026
  • Home  
  • అన్నదాతపై అక్రమ కేసులా? భేషరతుగా ఎత్తివేయాలి: నంది రైతు సమాఖ్య
- నంద్యాల

అన్నదాతపై అక్రమ కేసులా? భేషరతుగా ఎత్తివేయాలి: నంది రైతు సమాఖ్య

సాగు, తాగునీరు విడుదల చేయాలని కోరడానికి కలెక్టరేట్‌కు వెళ్లిన రైతులు, మాజీ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించడాన్ని ‘నంది రైతు సమాఖ్య’ తీవ్రంగా ఖండించింది. శ్రీశైలంలో 175 టీఎంసీల నీరున్నా దిగువకు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయి పశువులకు, ప్రజలకు తాగునీరు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అడ్డుకుని, రోడ్డుపై కూర్చున్న 35 మందిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు నీటిని విడుదల చేయాలని, రైతులపై బనాయించిన కేసులను ప్రభుత్వం, కలెక్టర్ భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సమాఖ్య నాయకులు రామ సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, మధుసూదన్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.