Thursday, 3 September 2026
  • Home  
  • జూలేపల్లెలో ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్
- నంద్యాల

జూలేపల్లెలో ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్

గోస్పాడు/జూలేపల్లె: గ్రామీణ ప్రజల ముంగిట్లోనే మెరుగైన ప్రాథమిక ఉచిత వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. గోస్పాడు మండలం జూలేపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్’ భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణులు చిన్న చిన్న వ్యాధులు, పరీక్షల కోసం పట్టణాలకు వెళ్లకుండా గ్రామంలోనే మందులు, గర్భిణులకు పరీక్షలు, ప్రాథమిక చికిత్స అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు వెచ్చిస్తోందన్నారు. కార్యక్రమంలో దీబగుంట్ల సొసైటీ చైర్మన్ నలిపెల ఓబులరెడ్డి, కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.