శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి టెంపుల్ న్యూస్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పుత్తేరి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు MGM హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మంది గ్రామస్తులు పాల్గొని తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య సలహాలు పొందారు. MGM హాస్పిటల్స్‌కు చెందిన నిపుణుల బృందం చిన్నపిల్లలు, స్త్రీల ఆరోగ్యం, ఎముకలకు సంబంధించిన సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు డా. ఉమా మహేశ్వర్ రావు, డా. ముని లక్ష్మి, డా. కార్తిక్, ఎమర్జెన్సీ వైద్యుడు డా. పవన్ పాల్గొని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో పుత్తేరి గ్రామ సర్పంచ్ రామమూర్తి, పంచాయతీ కార్యదర్శి నాగార్జున, డిజిటల్ ఇంజనీర్ హరీష్, ANM నాగరాజమ్మ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు సేవలు అందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, MGM హాస్పిటల్స్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బందికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

రెడ్ క్రాస్ – MGM ఆధ్వర్యంలో వైద్య శిబిరం విజయవంతం