Thursday, 3 September 2026
  • Home  
  • రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి: మంత్రి ఫరూక్‌కు రజక సంఘాల వినతి
- నంద్యాల

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి: మంత్రి ఫరూక్‌కు రజక సంఘాల వినతి

నంద్యాల :రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ రజక సంఘాల నాయకులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి తమ డిమాండ్లను విన్నవించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రజకులు ఇప్పటికే ఎస్సీ జాబితాలో ఉన్నారని గుర్తుచేశారు. ఎన్నికల హామీ మేరకు రజకుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక అధ్యయనం చేపట్టి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ధోబి మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా కన్వీనర్ సుబ్రహ్మణ్యం, ఇతర నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల :రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ రజక సంఘాల నాయకులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి తమ డిమాండ్లను విన్నవించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రజకులు ఇప్పటికే ఎస్సీ జాబితాలో ఉన్నారని గుర్తుచేశారు. ఎన్నికల హామీ మేరకు రజకుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక అధ్యయనం చేపట్టి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ధోబి మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా కన్వీనర్ సుబ్రహ్మణ్యం, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.