కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఒంటితాడి గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో అధిక ప్రమాదం ఉన్న గ్రామాల్లో హెచ్ఐవి సహసంక్రమణ మరియు అవకాశవాద వ్యాధులపై సామూహిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ హెచ్ఐవి సహసంక్రమణ మరియు అవకాశవాద వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని,తద్వారా అవి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా చిత్రాలతో కూడిన సమాచార కరపత్రికలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు బీమాబాయి మహిళా మండలి ప్రోగ్రాం డాక్యుమెంటేషన్ కోఆర్డినేటర్ పి ఎస్ ఆర్ కనకాంబరం,హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ,మండల లెవెల్ ఇంప్లిమెంటర్లు జి రామయ్య శెట్టి,డి అర్జునరావు,కే శివశంకర్,కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎం నూకలక్ష్మి,వి అనితాకుమారి,డి లోవ కుమారి,సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఐవి సహసంక్రమణ మరియు అవకాశవాద వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి