Tuesday, 29 September 2026

Tag: Kadapa

కడప

కడప నగరం లో పవన్ స్కూల్ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కడపలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ నందు గల పవన్ స్కూల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ లెక్కల జోగి రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులు వివిధ సమరయోధుల వేషధారణలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

కడప

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ పున్నమి ప్రతినిధి – కడప కడపలోని జనసేన పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇన్‌చార్జి సుంకర శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. దేశభక్తి, జాతీయత, ప్రజాసేవ జనసేన పార్టీ ప్రధాన సిద్ధాంతాలని పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశభక్తి, ప్రజాసేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని సుంకర శ్రీనివాస్ అన్నారు. దేశభక్తి అంటే కేవలం జెండా వందనం చేయడం మాత్రమే కాదని, దేశ చట్టాలను గౌరవించడం, ప్రజా ఆస్తులను కాపాడటం, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడం, దేశ అభివృద్ధికి కృషి చేయడమే నిజమైన దేశభక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, కడప నగర అధ్యక్షులు బోరెడ్డి నాగేంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

కడప

మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పున్నమి ప్రతినిధి – కడప కడపలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మాజీ సైనికుల సంఘం (KDESMA), AIEXBEF ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోటి రెడ్డి సర్కిల్ నుంచి అమర్ జవాన్ సర్కిల్ వరకు మాజీ సైనికులు, వీరనారులు దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, అమర వీరులకు నివాళులర్పించారు. సీనియర్ మాజీ సైనికులను లయన్స్ క్లబ్, కడప ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో మాజీ సైనికుల సంక్షేమం, సమస్యలపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో KDESMA, AIEXBEF, BEFI–AP ప్రతినిధులు పాల్గొన్నారు.

కడప

స్వాతంత్ర్య దినోత్సవం వేళ కడపలో మద్యం విక్రయాలపై ఆరోపణలు

స్వాతంత్ర్య దినోత్సవం వేళ కడపలో మద్యం విక్రయాలపై ఆరోపణలు పున్నమి ప్రతినిధి – కడప స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ, కడప నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల వద్ద ‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షాపులు బంద్’ అంటూ పోస్టర్లు ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో దుకాణాల సిబ్బంది బయట నిలబడి మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కడపలోని కోటిరెడ్డి సర్కిల్, గోకుల్ లాడ్జి, శివారు ప్రాంతాల సమీపంలోని కొన్ని మద్యం దుకాణాల వద్ద ఈ తరహా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. దుకాణాలు మూసివేసి బయట నుంచి విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించి, సంబంధిత దుకాణాలపై తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.

కడప

ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలి

ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలి పున్నమి ప్రతినిధి – కడప కడప నగరంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ యూనిట్ల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి ఉన్నత విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ విలువలను దెబ్బతీయాలని చూసే శక్తులకు వ్యతిరేకంగా ప్రజల ఐక్యత, సంఘీభావాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ. రామ్మోహన్, బి. మనోహర్, వి. అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు బి. దస్తగిరి రెడ్డి, కే. శ్రీనివాస్ రెడ్డి, కడప నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. రఘు, బి. జకరయ్య, కడప నగర కార్యదర్శి డి. నరసింహ, పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితర సీపీఐ(ఎం) జిల్లా నాయకులు, కడప నగర కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప

శ్రావణమాస మహోత్సవంలో ఘనంగా అన్నదానం

శ్రావణమాస మహోత్సవంలో ఘనంగా అన్నదానం పున్నమి ప్రతినిధి – కడప: శ్రీ శ్రావణమాస మహోత్సవంలో భాగంగా మొదటి శనివారం కడప నగరంలోని ఇంద్రానగర్ సమీపంలో ఉన్న పాలకొండ రాయ దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ భద్రాద్రి రామాలయం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ ఏటూరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా KSRM కళాశాల చైర్మన్ కందుల నాని, AMR అధినేత రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. శ్రావణమాసంలో అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని, భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

కడప

సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పున్నమి ప్రతినిధి – కడప వైఎస్సార్ జిల్లా కడపలోని సీఎస్‌ఐ సెంట్రల్ చర్చి, ఎస్‌పీజీ క్రైస్ట్ చర్చిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాయలసీమ అధ్యక్ష మండలి బిషప్ తండ్రి ది రైట్ రెవరెండ్ పయ్యాల ఐజాక్ వరప్రసాద్ గారు, వారి సతీమణి శ్రీమతి సీడీ భారతి గారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి గారు, డివిజనల్ చైర్మన్ రెవరెండ్ బి. విక్టరీ రాజుబాబు గారు, ట్రై చర్చ్ హాస్పిటల్ ఇన్‌చార్జ్ శాంతి స్వరూప్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, శాంతి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చర్చి సభ్యులు, మహిళా ఫెలోషిప్ సభ్యులు, యువత పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కడప

పాలకొండరాయస్వామి సన్నిధిలో శ్రావణమాస అన్నదాన మహోత్సవం

పాలకొండరాయస్వామి సన్నిధిలో శ్రావణమాస అన్నదాన మహోత్సవం పున్నమి ప్రతినిధి | పాలకొండరాయస్వామి ఆలయం, ఆగస్టు 14: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ పాలకొండరాయస్వామి వారి సన్నిధిలో అన్నదాన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 15వ తేదీ శ్రావణమాసం మొదటి శనివారం నుంచి సెప్టెంబర్ 5వ తేదీ నాల్గవ శనివారం వరకు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కొనసాగనుంది. శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పవిత్ర అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రీ పాలకొండరాయస్వామి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కడప

జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం

జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం పున్నమి ప్రతినిధి – కడప రానున్న ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా మహిళా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి , జిల్లా అధ్యక్షురాలు పులి వెంకటసుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు కోరారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో మహిళా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కడప

రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ ఎక్స్‌పో వాయిదా

రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ ఎక్స్‌పో వాయిదా కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: 2026 సంవత్సరానికి ప్రతిపాదించిన ‘రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్‌పో’ కార్యక్రమాన్ని పరిపాలనా కారణాలతో వాయిదా వేసినట్లు కడప జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఇంతకుముందు ప్రకటించిన కార్యక్రమ షెడ్యూల్, సంబంధిత కార్యక్రమాలన్నీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా పడినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.