Tuesday, 18 August 2026
  • Home  
  • కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
- కడప

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత కడప, ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి): కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఉద్యమకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హమాలీ, ఆటో, వీధి విక్రయదారుల కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

కడప, ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి):

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఉద్యమకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హమాలీ, ఆటో, వీధి విక్రయదారుల కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.