Wednesday, 30 September 2026

Tag: Kadapa

కడప

జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఘన సన్మానం

జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఘన సన్మానం కడప, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి): కడప జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి నియమితులైన సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి పీపీగా నియమితులు కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అనుభవం, సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ న్యాయ వ్యవస్థ పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు కీలకమైనవని, ప్రజలకు న్యాయం అందేలా చట్టపరమైన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా తన వంతు కృషి చేయాలని అభినందనలు తెలిపారు. పీపీగా నియామకం కావడంతో గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు న్యాయవాదులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ నాయకులు శ్రీనివాసులు, పుల్లయ్యతో పాటు పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

కడప

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా కడప, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి): కడప పట్టణంలోని మహావీర్ సర్కిల్‌లో ఉన్న జ్ఞాన్ విహార్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. కడప జిల్లా పాఠశాలల ఆటల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే, బాక్సింగ్, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో 9వ తరగతికి చెందిన అఖిల్ కుమార్ తేజ్, అశ్వద్ధామ, ధీరజ్, లక్ష్మీ నిహాంత్, 8వ తరగతికి చెందిన అజయ్ కృష్ణారెడ్డి వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు. ముఖ్యంగా బాక్సింగ్, టంట్కా విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు, పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు శిక్షణ అందించిన పాఠశాల కరాటే మాస్టర్ వెంకట్‌ను అభినందించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. పాఠశాల చైర్మన్ సుధాకర్, కరస్పాండెంట్ డా. రవి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు క్రీడల్లోనూ సమానంగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు సాధించిన విజయాలు పాఠశాలకు గర్వకారణమని, ఈ విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

కడప

19వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం

19వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం పున్నమి ప్రతినిధి కడప, సెప్టెంబర్ 29: “మన కడప – స్వచ్ఛ కడప” కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని 19వ డివిజన్‌లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి గారు ఆదేశాల మేరకు 19వ డివిజన్ కన్వీనర్ రంజిత్ గారి ఆధ్వర్యంలో అప్పారావు బిల్డింగ్స్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజలను ఇంటింటికీ కలిసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, బూత్ ఇంచార్జ్‌లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప

కడప విమానాశ్రయ నిర్మాణ పనుల పరిశీలన

కడప విమానాశ్రయ నిర్మాణ పనుల పరిశీలన పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26: కడప జిల్లా పర్యటనలో భాగంగా కడపలో నూతనంగా నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, నిర్మాణ పనులను వేగవంతం చేయడం, అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి సవితమ్మ, ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ విశ్వనాథ్, ఎయిర్‌పోర్ట్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కడప

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలి

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26: విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని కోరుతూ జేఏసీ నాయకులు కడప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ హరి సేవా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కం సంస్థల్లో 20 ఏళ్లకు పైగా సుమారు 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ సమయంలో కార్మికులకు తగిన ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జనరల్ సెక్రటరీ చంద్ర గంగిరెడ్డి, కోఆర్డినేటర్ హరికేశవరెడ్డి, శివారెడ్డి, నిత్యపూజ, నాగేంద్ర, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కడప

కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి

కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 26: కడప నగరపాలక సంస్థకు త్వరలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నజీముద్దీన్ కోరారు. ఈ మేరకు శనివారం కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో రాష్ట్ర ఇన్‌చార్జి మంత్రి సవితకు తన విజ్ఞప్తితో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కడప నగరంలో మైనార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా మేయర్ పదవిని మైనార్టీలకు కేటాయించాలని ఆయన మంత్రిని కోరారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి, మైనార్టీలకు మేయర్ పదవిలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు భూమేష్, ప్రధాన కార్యదర్శి జాబి ఉల్లా, తదితరులు పాల్గొన్నారు.

కడప

ఇడుపులపాయలో టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలోకి వలసలు

ఇడుపులపాయలో టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలోకి వలసలు పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 కడప జిల్లా ఇడుపులపాయలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇడుపులపాయ పంచాయతీ పరిధిలోని మారుతి నగర్‌లో టీడీపీకి చెందిన పలువురు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గండి ఆలయ మాజీ చైర్మన్ కావలి కృష్ణతేజ ఆధ్వర్యంలో టీడీపీని వీడి పలువురు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇడుపులపాయలో చోటుచేసుకున్న ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇడుపులపాయ వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోతిరెడ్డి శ్రావణ్ కుమార్, పోతిరెడ్డి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

కడప

ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మొగలి నాగరాజు మృతి బాధాకరం — ఆర్‌పీఐ (అత్వాలే) నేతల సంతాపం

ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మొగలి నాగరాజు మృతి బాధాకరం — ఆర్‌పీఐ (అత్వాలే) నేతల సంతాపం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 కడప నగరం కందిపాలెంకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, అంబేద్కర్‌వాది మొగలి నాగరాజు మృతి బాధాకరమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) దక్షిణ రాష్ట్రాల అధ్యక్షుడు ఎన్.డి. అజయ్ ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ వై. రమేష్ బాబు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ జ్యోతి జార్జ్, జిల్లా అధ్యక్షుడు ఆకాశి సురేష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ దాసరి గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు వారు సంయుక్త ప్రకటనలో తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మొగలి నాగరాజు గతంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రజా జీవితంలో ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. స్నేహశీలిగా, మంచితనానికి మారుపేరుగా పేరుపొందిన నాగరాజు మృతి దళిత, బహుజన వర్గాలకు తీరని లోటని వారు పేర్కొన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన నాగరాజు స్వయంకృషి, కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని న్యాయవాద వృత్తిలో రాణించడంతో పాటు, అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. కడప కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ దళితుల సమస్యలపై న్యాయపరంగా పోరాడారని, అనేక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల తరఫున న్యాయ సహాయం అందించారని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులతో కూడా న్యాయపరంగా పోరాటం చేస్తూ ఎంతోమంది దళితులకు అండగా నిలిచారని తెలిపారు. కడప జిల్లా కోర్టులో ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారని గుర్తుచేశారు. న్యాయవాదిగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం తన వంతు కృషి చేసిన వ్యక్తిగా మొగలి నాగరాజు సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నాగరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కడప

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25, కడప: కడప నగరంలోని ఆర్కే నగర్‌లో 4వ డివిజన్‌కు సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, ఈస్ట్ జోన్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ప్రతి డివిజన్‌లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పాలనలోని వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. కడప నగరంలోని 66 డివిజన్లలో పార్టీని మరింత బలోపేతం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు అందజేస్తామని తెలిపారు. కడప ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం తప్ప నగర అభివృద్ధికి చేసిన పని శూన్యమని అంజాద్ బాషా విమర్శించారు. కడప నగర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కేవలం మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేయించారో, ఏయే అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చారో కడప ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో, తీసుకొచ్చిన నిధులు ఎంతమేరకు ఉన్నాయో ప్రజల ముందుకు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ ఆర్.వి. రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ రెడ్డి, రాయలసీమ జోన్ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, నాయకులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, గాని తదితరులు పాల్గొన్నారు.

కడప

పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ విచారణ

పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ విచారణ పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25, కడప జిల్లా: పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. 2018లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన ఏసీబీ దాడులకు సంబంధించిన అంశాలపై అధికారులు ఎంక్వైరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. 2018లో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన బాలాజీతో పాటు ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దస్తగిరిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. గతంలో నమోదైన అంశాలకు సంబంధించిన వివరాలు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.