కార్పొరేషన్ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు
కడప, అక్టోబర్ 2 ( పున్నమి ప్రతినిధి):
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప శాసనసభ్యురాలు మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అందించిన సేవలను, ఆయన ఆశించిన అహింస, శాంతి, గ్రామ స్వరాజ్యం వంటి ఆదర్శాలను స్మరించుకున్నారు. మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, నగరపాలక సంస్థ సిబ్బంది, ఏపీ లేబర్ బోర్డు డైరెక్టర్ దోమల చంద్రమోహన్ రెడ్డి, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ చిట్టిపోయిన సుబ్బరాయుడు యాదవ్, పాలకొండ చైర్మన్ రెడ్డయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




