(పున్నమి ప్రతినిధి)వేముల, అక్టోబర్ 3:
వేముల గ్రామ పంచాయతీ పరిధిలోని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ (SWPC)లో వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియలో భాగంగా వానపాములను వదిలేందుకు బెడ్‌ను సిద్ధం చేశారు. బెడ్‌లో అవసరమైన సేంద్రియ పదార్థాలు, ఎరువును వేసి, తగిన తేమను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం వానపాములను ప్రవేశపెట్టి నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారీకి చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీలో సేకరించే తడి చెత్తను సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పారిశుధ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి (PDO), గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.










