వార్త ముఖ్యాంశాలు
- కడప జిల్లా బ్రహ్మంగారిమఠం లోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం సెక్టర్ మీటింగ్ నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ డివిజన్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మల్లేష్, డాక్టర్ శ్రీకాంత్ హాజరయ్యారు, ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ…
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం లోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం సెక్టర్ మీటింగ్ నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ డివిజన్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మల్లేష్, డాక్టర్ శ్రీకాంత్ హాజరయ్యారు, ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మల్లేష్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆశ వర్కర్ల పాత్ర కీలకమన్నారు, ఫీల్డ్ స్థాయిలో నిర్వహిస్తున్న గర్భిణీల సంరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు, ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని ఆదేశించారు, అనంతరం గత నెలలో నిర్వహించిన వైద్య కార్యక్రమాలపై పురోగతి పై సమీక్షించారు, ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పుష్పరాజ్, లక్ష్మీదేవి, హెల్త్ అసిస్టెంట్ మాధవ, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు ,ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.