Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

పోలీసుల త్యాగాలు మరువలేనివి -కమాండెంట్ కే.ఆనందరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలీసుల త్యాగాలు మరువలేనివి -కమాండెంట్ కే.ఆనందరెడ్డి

పోలీసుల త్యాగాలు మరువలేనివి

-కమాండెంట్ కే.ఆనందరెడ్డి

-11వ బెటాలియన్‌లో అమరవీరుల దినోత్సవం

సిద్ధవటం,అక్టోబర్ 21 ( వార్తలు ప్రతినిధి )

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేనివని ఏపీఎస్పీ 11వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ కె. ఆనందరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని భాకరాపేట 11వ పోలీసు బెటాలియన్‌లో బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, అమరులైన పోలీసుల పేర్లను చదివి స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అసాంఘిక శక్తులను ఎదుర్కొనే క్రమంలో ఎందరో పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలను స్మరించుకోవడంతో పాటు, కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు కమాండెంట్ జ్ఞాపికలను అందజేశారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుదర్శనరెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు, నూతనంగా నియమితులైన పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

పోలీసుల త్యాగాలు మరువలేనివి -కమాండెంట్ కే.ఆనందరెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *