నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
രചയിതൃ പാനൽ
కడప

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 వేముల మండలానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

(పున్నమి ప్రతినిధి)
కడప, అక్టోబర్ 2: “స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో వేముల మండలానికి జిల్లా స్థాయి అవార్డు లభించింది. జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఐఏఎస్ చేతుల మీదుగా వెలుగు–డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు అవార్డును స్వీకరించారు.

మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ గుర్తింపు లభించింది. కిచెన్ గార్డెన్ల ప్రోత్సాహం, వ్యర్థాల వేరు చేయడం, గ్రామ పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు.

ఈ సందర్భంగా ఏపీఎం ఆంజనేయులు మాట్లాడుతూ వేముల మండలానికి అవార్డు లభించడం ఆనందదాయకమన్నారు. మహిళా సంఘాలు, గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, వెలుగు సిబ్బంది, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, గ్రామ సమాఖ్య అసిస్టెంట్ల సమన్వయంతో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దగలమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *