59వ వారోత్సవాల్లో భాగంగా ది. 15.11.2026న మైలవరం శాఖ గ్రంధాలయం నందు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను M. E. O. L.బాలు గారు ప్రారంభించారు. పుస్తక పఠనం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. “చదవడం నేర్చుకోవడానికి, నేర్చుకోవడం నాయకత్వం వహించడానికి” పూర్వం మన పూర్వీకులు గ్రంథాలయాలను దేవాలయాలుగా భావించేవారు. వివేకానందుడు,అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి మహానుభావులందరూ గొప్ప పుస్తక ప్రియులే, వారు చదివారు కాబట్టి నేర్చుకున్నారు. నేర్చుకున్నారు కాబట్టి ప్రపంచానికి నాయకులయ్యారు అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు విద్యార్థినీ,విద్యార్థులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

