1,000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ
1,000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 1,000 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు ఎర్రముక్కపల్లి సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. జాతీయ సమైక్యత, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం కొనసాగింది.




