పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ విచారణ
పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 25, కడప జిల్లా:
పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. 2018లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన ఏసీబీ దాడులకు సంబంధించిన అంశాలపై అధికారులు ఎంక్వైరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
2018లో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన బాలాజీతో పాటు ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దస్తగిరిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. గతంలో నమోదైన అంశాలకు సంబంధించిన వివరాలు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.




