కడప విమానాశ్రయ నిర్మాణ పనుల పరిశీలన
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26: కడప జిల్లా పర్యటనలో భాగంగా కడపలో నూతనంగా నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, నిర్మాణ పనులను వేగవంతం చేయడం, అవసరమైన చర్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి సవితమ్మ, ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ విశ్వనాథ్, ఎయిర్‌పోర్ట్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.








