ఖానాపురం పున్నమి ప్రతినిధి:
వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకట నారాయణ గౌడ్ అన్నారు. బి ఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు మేరకు నర్సంపేటలో ఐలమ్మ జయంతి నిర్వహించడం జరిగింది. ఐలమ్మ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ ప్రజలకు తెగువకు పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తి కి ప్రతికముగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాయిఢీ రవీందర్ రెడ్డి మునిగల వెంకట్ రెడ్డి నల్ల మనోహర్ రెడ్డి లెక్కల విద్యాసాగర్ రెడ్డి తక్కెలపల్లి రవీందర్రావు మొదలైన వారు పాల్గొన్నారు.



