సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్య దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. అలాగే సెప్టెంబర్ 27 ఆదివారం కావున బ్యాంకులు యధావిధిగా ఉంటాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఖాతాదారులు తమ ముఖ్యమైన బ్యాంకు పనులను ఈరోజే పూర్తి చేసుకోవడం మంచిది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి డిపాజిట్లకు సంబంధించి ఏవైనా పెండింగ్ పనులు ఉంటే వెంటనే చక్కబెట్టుకోండి. ఆలస్యమైతే వడ్డీ జమ కావడంలో ఇబ్బందులు ఎదురవ్వడమే కాకుండా, కొత్త త్రైమాసికం ప్రారంభమయ్యేలోపు పెట్టుబడి గడువు కూడా ముగిసిపోయే ప్రమాదం ఉంది.
సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో బ్యాంకుల సమ్మె దృష్ట్యా, సెప్టెంబర్ 27 ఆదివారం నాడు అన్ని శాఖలు పనిచేస్తాయి. దయచేసి మీ అత్యవసర బ్యాంకింగ్ పనులను సెప్టెంబర్ 27, 2026 నాటికి పూర్తి చేసుకోగలరని మనవి. మా 24×7 డిజిటల్ సేవలు – ఇంటర్నెట్ బ్యాంకింగ్ / మొబైల్ బ్యాంకింగ్ ) / UPI / ATMలు / BC / బ్యాంక్ మిత్ర పాయింట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి


