డ్రగ్స్ కేసుల్లో ఈడీ భారీ సోదాలు
నషా ముక్త్ భారత్ లక్ష్యంలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దక్షిణాది రాష్ట్రాల్లో భారీ సోదాలు చేపట్టింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎనిమిది వేర్వేరు కేసుల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ సోదాలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాతో ముడిపడిన ఆర్థిక లావాదేవీలు, నిధుల మార్గాలను గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా ఈడీ చర్యలు చేపట్టింది.



