Tuesday, 25 August 2026
  • Home  
  • బండలేమూర్‌లో అంత్యక్రియలకు మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం
- రంగారెడ్డి

బండలేమూర్‌లో అంత్యక్రియలకు మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం

బండలేమూర్‌లో అంత్యక్రియలకు మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబానికి అండగా రూ.5 వేల ఆర్థిక సాయం మంచాల: మండలంలోని బండలేమూర్ గ్రామానికి చెందిన రమావత్ పత్తి ఆదివారం (23-08-2026) తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, 1వ వార్డు సభ్యుడు శిరీష చందు తన బృందంతో కలిసి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బండలేమూర్ మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. పత్తి మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరితో మర్యాదగా మెలిగే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తమ మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మంగ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబాల కష్టాలను గుర్తించి, వారికి తన వంతు సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. పేద కుటుంబాలకు మరింత సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యుడు శిరీష చందు, తుల్జా భవాని యూత్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ యువ నాయకుడు సభావట్ లచ్చిరాం, కాంగ్రెస్ యువ నాయకుడు రమావత్ నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాతులోత్ నాను నాయక్, పాతులోత్ తావు నాయక్, సభావట్ జగ్గు, రమావత్ మంగ్త నాయక్ తదితరులు పాల్గొని మృతుడికి నివాళులర్పించారు.

బండలేమూర్‌లో అంత్యక్రియలకు మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి అండగా రూ.5 వేల ఆర్థిక సాయం

మంచాల: మండలంలోని బండలేమూర్ గ్రామానికి చెందిన రమావత్ పత్తి ఆదివారం (23-08-2026) తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, 1వ వార్డు సభ్యుడు శిరీష చందు తన బృందంతో కలిసి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా బండలేమూర్ మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. పత్తి మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరితో మర్యాదగా మెలిగే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తమ మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు.

మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మంగ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబాల కష్టాలను గుర్తించి, వారికి తన వంతు సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. పేద కుటుంబాలకు మరింత సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యుడు శిరీష చందు, తుల్జా భవాని యూత్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ యువ నాయకుడు సభావట్ లచ్చిరాం, కాంగ్రెస్ యువ నాయకుడు రమావత్ నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాతులోత్ నాను నాయక్, పాతులోత్ తావు నాయక్, సభావట్ జగ్గు, రమావత్ మంగ్త నాయక్ తదితరులు పాల్గొని మృతుడికి నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.