Wednesday, 23 September 2026

Tag: Hyderabad

మేడ్చల్ – మల్కాజిగిరి

_సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నాం : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు…_*

పున్నమి ప్రతినిధి: ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

విద్యార్థులతో కలిసి సద్భావన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గిరి నగర్ డివిజన్‌కు చెందిన కట్టే శ్రీకాంత్ యాదవ్, ఆధ్వర్యంలో ఐడీపీఎల్ చౌరస్తా వద్ద నిర్వహించిన సద్భావన ర్యాలీలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్, మాట్లాడుతూ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సద్భావన ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ,కి దక్కుతుందని శ్రీశైలం గౌడ్, అన్నారు. యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బహుమతులను అందజేసి అభినందించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాంత్ యాదవ్ ను శ్రీశైలం గౌడ్, ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గుప్తా, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జై రామ్, గంధం రాములు, సత్యనారాయణ, ప్రైవేట్ పాఠశాలల యజమానులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి* అర్పించిన సొంటిరెడ్డి పున్నారెడ్డి

*భారత మాజీ ప్రధానమంత్రి, యువతకు స్ఫూర్తిప్రదాత స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి* దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఇట్లు, మాజీ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు *సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు*

మేడ్చల్ – మల్కాజిగిరి

పున్నమి ప్రతినిధి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం* *జగద్గిరిగుట్ట, పాపిరెడ్డి నగర్*

15 ఆగస్టు శనివారం రోజు జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లోని _Smart KIDZ Patasala_ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సైనికులు, పోలీసు అధికారులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. “HAPPY INDEPENDENCE DAY 15th August” అనే బ్యానర్, త్రివర్ణ పతాకాలు, పావురాలతో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణం సంతరించుకుంది. చిన్న వయసులోనే దేశభక్తిని చాటిన పిల్లల ప్రదర్శన చూసి తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసించారు. _”చిన్న చేతుల్లో పెద్ద దేశభక్తి. Smart KIDZ Patasala నుండి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు”_ 🇮🇳 —

మేడ్చల్ – మల్కాజిగిరి

పున్నమి ప్రతినిధి 80 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న శ్రీ మార్యండేయ చేనేత పారిశ్రామిక సహకార సంఘం

1947లో ఆవిర్భావం.. 2027లో 80వ వార్షికోత్సవం ఆరవల్లి ప్రాంతంలో చేనేత రంగ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న శ్రీ మార్యండేయ చేనేత పారిశ్రామిక సహకార వృత్తి విక్రయ సంఘం లిమిటెడ్2027 ఫిబ్రవరి 10 నాటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సంఘం 1947 ఫిబ్రవరి 10న స్థాపించబడగా, అదే సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రారంభమైనట్లు సంఘం వివరాలు వెల్లడిస్తున్నాయి. చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, సంప్రదాయ వస్త్ర కళల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం ఎనిమిది దశాబ్దాలుగా తన సేవలను కొనసాగిస్తోంది. సంఘ చరిత్రకు గుర్తుగా 1947లో తీసిన సభ్యుల సమూహ చిత్రాన్ని భద్రపరుస్తూ, నాటి చేనేత కార్మికుల సేవలను స్మరించుకుంటున్నారు. సంఘం 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1947–2027 కాలాన్ని గుర్తుచేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. పాతతరం చేనేత కార్మికుల కృషిని నేటి తరానికి పరిచయం చేయడంతో పాటు, సహకార వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ వేడుకల ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొన్నారు. “మన పూర్వీకుల కృషి – మన సమాజ అభివృద్ధికి పునాది” అనే సందేశంతో 80వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఇది 19 47 స్వతంత్రం రాకముందు పద్మశాలి చేనేత సహకార సంఘం ఏర్పాటు చేసిన మా తాతలు పొన్నగంటి అప్పలస్వామి పొన్నగంటి సంజీవ్ సంజీవ్ ఇది ఎప్పటిదో ఫోటో దొరికింది దీన్ని బట్టి వారి మనవడు పొన్నగంటి అప్పారావు పద్మశాలి ఈ విషయాన్ని మనకు తెలియజేశారు

మేడ్చల్ – మల్కాజిగిరి

*వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీ సొసైటీ కార్యాలయం నందు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన గారు, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి గార్లతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు గారు.

పున్నమి ప్రతినిధి: *వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీ సొసైటీ కార్యాలయం నందు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన గారు, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి గార్లతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు గారు.* *రంగారావు గారు మాట్లాడుతూ సృజన మేడం గారికి తెలియజేసిన అంశాలు ఏమనగా వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంలో ఈరోజు వివేకానంద నగర్ కాలనీ డివిజన్ మరియు వెంకటేశ్వర నగర్ డివిజన్ రెండు డివిజన్లో వారికి సంబంధించిన వారిని పిలవడం అన్ని కాలనీలా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకి తెలుపకపోవడం, SIR లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ చేసిన విధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో కూడా పొలిటికల్ పార్టీస్ ని ఇన్వాల్వ్ చేసినట్లయితే బాగుంటుందని , ముఖ్యంగా రెండు డివిజన్లకి సంబంధించినటువంటి సమస్యలు నాలా పొడవునా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడం , నాళా లో ఉన్నటువంటి సివరేజ్ లైను డ్యామేజ్ అయి సేవెరేజ్ వాటర్ పూర్తిగా నాళా లో ప్రవహించడం వలన వచ్చే దుర్వాసన వలన చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కెసిఆర్ గారి ప్రభుత్వంలో కాజా కుంటలో 10 mld గా ఉన్నటువంటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును 20 mld గా చేసినారు కావున దాంట్లో వాడకం కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా ఆ లైన్ ను బాగు చేయడం లేదా కొత్తగా వేయడం చేసి సేవెరేజ్ వాటర్ ని మొత్తం STP సెవెరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి పంపించే విధంగా చేయాలని అలాగే ఆస్బెస్టాస్ కాలనీ సొసైటీ కార్యాలయం నుండి కమల ప్రసన్న నగర్ పైప్లైన్ రోడ్ బ్రిడ్జి వరకు నాలా రిటర్నింగ్ పనులు మంజూరు చేయాలని మరియు cc రోడ్స్,శానిటేషన్, వీధిదీపాలు కూడా సరిగా పనులు చేయడం లేదని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటివరకు ఈ రెండు డివిజన్లకు సంబంధించి పనులు ఏమీ మంజూరు చేయలేదని ఇప్పటికైనా రెండు డివిజన్లో సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డ్ సంబంధించినటువంటి పనులు చాలా ఉన్నాయని వారి దగ్గర ఫండ్స్ లేవని మరి మీరు వారి తోటి కోఆర్డినేషన్ చేసి మంజూరు చేయించగలరని కోరారు.* *ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో వాటర్ బస్ అండ్ సీవరేజ్ బోర్డ్ డీజీఎం శ్రీనివాస్ రాజు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోనల్ కి సంబంధించిన వివిధ విభాగాల అధికారులు రెండు డివిజన్ల లకు సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

పున్నమి ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న _హర్ ఘర్ తిరంగా_ కార్యక్రమం

పున్నమి ప్రతినిధి: 🇮🇳🚩 హర్ ఘర్ తిరంగా – భారీ ర్యాలీ 🇮🇳🚩 ఈరోజు షాపూర్ డివిజన్‌లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీ కేశవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ ఘనంగా జరిగింది. 🇮🇳🚩 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి గారు మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ జే.కే. శేఖర్ యాదవ్ గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 🇮🇳 ఈ కార్యక్రమంలో ఓబీసీ సెక్రటరీ శ్రీ మసాని రమేష్ గారు, రఘుపతి, సిద్ధార్థ్, సాయి జీవంత్, తిరుపతి దాస్, కిరణ్, స్వాతి, సరోజిని, రాధిక, దీపక్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 🇮🇳 జై హింద్! 🚩 భారత్ మాతాకీ జై! 🇮🇳

మేడ్చల్ – మల్కాజిగిరి

పున్నమి ప్రతినిధి : శ్రీ ఆర్యవైశ్య సంఘం బాచుపల్లి ఆధ్వర్యంలో ఘనంగా అన్నవితరణ కార్యక్రమం

బాచుపల్లి, ఆగస్టు 12, 2026: అమావాస్య సందర్భంగా శ్రీ ఆర్యవైశ్య సంఘం బాచుపల్లి (Vasavi Club Bachupally) ఆధ్వర్యంలో బుధవారం బాచుపల్లిలో అన్నవితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది ప్రజలకు అన్నవితరణ చేసి వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత, కొలను హనుమంత్ రెడ్డి, కొలను వీరేందర్ రెడ్డి, పోలీసు అధికారులు సీఐ, ఎస్‌ఐలు తదితర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు వీరేశం, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్, కోశాధికారి రఘు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులు శివ రాజ్ గుప్తా, బద్రి, వెంకటేశ్వర్లు, నితేష్, అనిల్, కార్తిక్, మహిళా మణులు మరియు సంఘ సభ్యులు పాల్గొని అన్నవితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం గొప్ప మానవతా సేవ అని తెలిపారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అన్నవితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలు, సంఘ సభ్యులు, మహిళా మణులు, స్వచ్ఛంద కార్యకర్తలు మరియు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీ ఆర్యవైశ్య సంఘం బాచుపల్లి (Vasavi Club Bachupally) తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “సేవే మా లక్ష్యం – సమాజమే మా కుటుంబం” అనే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని సంఘం ప్రతినిధులు తెలిపారు.

Blog E-పేపర్ Featured Others ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పశ్చిమ గోదావరి పిల్లలకు విద్య విజ్ఞానం

APSET–2025 నోటిఫికేషన్ విడుదల

APSET–2025 నోటిఫికేషన్ విడుదల యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):➡️ 28 & 29 మార్చి 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:➡️ 09 జనవరి 2026 దరఖాస్తు ఫీజు:🔹 జనరల్: ₹1600/-🔹 BC / EWS: ₹1300/-🔹 SC / ST / PwD / థర్డ్ జెండర్: ₹900/- అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు, లేట్ ఫీజు వివరాలు తదితర సమాచారం కోసం: www.andhrauniversity.edu.inwww.apset.net.in

పశ్చిమ గోదావరి

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య ▪️ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ విద్య నేర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యోగా, ఆరోగ్య విద్య, డ్రిల్, క్రీడలు నిర్వహించాలని సూచించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి తరగతికీ వారానికి ఆరు పీరియడ్లను ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికీ రోజుకు కనీసం ఒకగంట శారీరక శ్రమ ఉండేలా చూడాలని ఆదేశించింది. పాఠశాల అసెంబ్లీలో ప్రతి రోజూ పది నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ను నిర్దేశించిన సిలబస్ మేరకు ఆరోగ్య విద్యకు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు కాల నిర్ణయం పట్టికను విడుదల చేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.