మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గిరి నగర్ డివిజన్‌కు చెందిన కట్టే శ్రీకాంత్ యాదవ్, ఆధ్వర్యంలో ఐడీపీఎల్ చౌరస్తా వద్ద నిర్వహించిన సద్భావన ర్యాలీలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్, మాట్లాడుతూ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సద్భావన ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ,కి దక్కుతుందని శ్రీశైలం గౌడ్, అన్నారు. యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బహుమతులను అందజేసి అభినందించారు.
ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాంత్ యాదవ్ ను శ్రీశైలం గౌడ్, ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గుప్తా, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జై రామ్, గంధం రాములు, సత్యనారాయణ, ప్రైవేట్ పాఠశాలల యజమానులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



