Wednesday, 23 September 2026

Tag: Hyderabad

హైదరాబాద్

రేవంత్‌తో విభేదాలు లేవు: మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల ప్రయాణం సంతృప్తికరంగా సాగిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని, అభిప్రాయ భేదాలు వచ్చినా వెంటనే పరిష్కరించుకున్నామని చెప్పారు. పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేశామని పేర్కొన్నారు. కుల సర్వే ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం జరిగిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ లేకపోతే తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ నెలాఖరులోపు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ల ఎంపికలో డీసీసీ అధ్యక్షుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.

హైదరాబాద్

ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ వారసత్వ సంపద పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సేవలను సీఎం ప్రశంసించారు. మూసీ పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం పునరుద్ధరణకు సహకారం కోరారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. 30 వేల ఎకరాల్లో నెట్-జీరో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్

సచివాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

హైదరాబాద్ సచివాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన వ్యవహారంలో రూ.2 లక్షల మంజూరుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సచివాలయ ఆవరణలోని ఆలయం వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటుండగా సెక్షన్ ఆఫీసర్ వినోద్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అతనితో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటన సచివాలయ వర్గాల్లో కలకలం రేపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, లంచం డిమాండ్ వెనుక ఉన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్

అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. బీఆర్ఎస్ నేతలపై కేసు

హైదరాబాద్‌ అసెంబ్లీ గేట్‌ నం.3 వద్ద జరిగిన ఘర్షణపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్‌ నేతల పేర్లను FIRలో చేర్చారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగినట్లు పోలీసులు ఆరోపించారు. వీడియో, సీసీటీవీ, మీడియా ఫుటేజీ ఆధారంగా నేతల పాత్రను నిర్ధారించి దర్యాప్తు చేపట్టనున్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

మున్నూరు కాపు లు కలిసి ట్రస్టు రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేశారు

మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ మాకు దైవ సమానులు తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు పటేల్ సంఘం వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్: సుభాష్ నగర్ & కైలాస్ నగర్ కాలనీల అధ్యక్షులు మా మున్నూరు కాపుల నాయకుడు & జగద్గిరిగుట్ట మున్నూరు కాపు సంఘం చైర్మన్ స్థల ప్రదాత శ్రీ భోగి బాలరాజ్ అన్న & వారి కుటుంబసభ్యుల అందరికీ జగద్గిరిగుట్ట మున్నూరు కాపు సంఘం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞత నమస్సుమాంజలి తెలియజేస్తూ: 07-09-2026 దేవదేవుడైన లోకాలనేలే శివయ్య ఆఖరి శ్రావణ సోమవారం రోజున జగద్గిరిగుట్టలో ఉన్న మున్నూరు కాపులంతా మరువలేని మర్చిపోలేని అపురూప ఘట్టానికి నాంది పలుకుతూ ఈరోజు ట్రస్టుగా రిజిస్ట్రేషన్ చేయించినారు ఈ ట్రస్టులో చైర్మన్ శ్రీ భోగి బాలరాజ్ & మెంబర్స్జ బాపూజీ హై స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రీ నవ్య ప్రభాకర్ ఆల్వేన్ కాలనీ బాలరాజు 121 కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ పాపిరెడ్డి నగర్ శ్రీనివాస్ శ్రీధర్ పార్టీల & శ్రీ తాడేం మల్లేశం పాపిరెడ్డి నగర్ అక్క సాయిని శ్రీనివాస్ శ్రీ రామగాళ్ల ఆంజనేయులు పంతం వేణు తమ్ముడు గారు మా అల్లుడు శ్రీ తాటిపాముల రాజశేఖర్ గారు శ్రీ పత్తి మల్లేశం ట్రస్టులో నియమించబడిన మెంబర్స్ తరపున మరొకసారి హృదయపూర్వకనమస్సుమాంజలితెలియజేస్తున్నాము సాయిని శ్రీనివాస్

హైదరాబాద్

ఆడబిడ్డలపై దాడి.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. సీఎం క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమన్నారు. వెయ్యి రోజుల ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్

వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: తాతా మధు

తాను అనని మాటలను తనకు ఆపాదిస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. తన డొక్కలో పోలీసులు పిడిగుద్దులు గుద్దినా తాను ఏమీ మాట్లాడలేదన్నారు. అసహనంతో తాను అనని మాటలను స్పీకర్‌కు ఆపాదించారని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, మహిళా శాసనసభ్యులపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన విషయాలను రేపు కౌన్సిల్‌లో మాట్లాడతానన్నారు.

హైదరాబాద్

స్పీకర్‌పై వ్యాఖ్యలు క్షమించరాని నేరం

శాసనసభ స్పీకర్‌ను, ఆయన కుటుంబాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది వ్యక్తిగత అవమానం కాదని, సభ గౌరవానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమన్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభా నాయకుడిగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడితో రాజీనామా చేయించి, సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్

సింగరేణి మారుపేర్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం

సింగరేణి కాలరీస్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. 1997 నుంచి కొనసాగుతున్న ఈ సమస్యపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం సుమారు 90 వేల మంది ఉద్యోగుల్లో 128 మంది మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. చట్టపరమైన చిక్కుల కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగేస్తున్న నేపథ్యంలో, ఏ ఒక్క అధికారిపై భారం పడకుండా కమిటీ సిఫార్సుల ఆధారంగా శాశ్వత పరిష్కారం చూపిస్తామని భట్టి స్పష్టం చేశారు

హైదరాబాద్

హరీశ్‌రావు అరెస్ట్.. ఉద్రిక్తత

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. ఆయనతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తమను ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారం ఇవ్వకుండానే పోలీసులు నిర్బంధించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అరెస్టులతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.