Wednesday, 23 September 2026

Tag: Hyderabad

హైదరాబాద్

హామీలపై కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్

అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లపై ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, భూ కేటాయింపులు, జీవో 97పై ప్రశ్నిస్తామన్నారు. అన్ని వర్గాల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని నెలరోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్

అసెంబ్లీకి రావాలా?.. మీరే చెప్పండి: కేసీఆర్

BRSLP సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీకి రావడం అవసరమా అని ప్రశ్నించారు. ‘‘నేను అసెంబ్లీకి రావాలా? వద్దా? మీరే చెప్పండి’’ అని నేతలను అడిగారు. తన చావు కోరుతూ పదేపదే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనను ‘థర్డ్ క్లాస్ పాలన’గా అభివర్ణించారు. తెలంగాణలో ‘రైజింగ్ కాదు.. ఫాలింగ్’ కనిపిస్తోందన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల వద్దకు లక్ష మందితో వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్

కేసీఆర్ నేతృత్వంలో మహా ఉద్యమం: హరీశ్‌రావు

అసెంబ్లీ సమావేశాల అనంతరం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చకు అసెంబ్లీని కనీసం నెలరోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, కరెంట్ కోతలు, 22ఏ భూములు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అవసరమైతే సభను స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు వెల్లడించారు.

హైదరాబాద్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్ అనుబంధ హైపర్‌వాల్ట్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 7 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టీసీఎస్–హైపర్‌వాల్ట్ ప్రతినిధులు సమావేశమై ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్, గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచస్థాయి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లకు భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులు అందనున్నాయి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు బలమైన పునాది అవుతుందని సీఎం పేర్కొన్నారు. విద్యుత్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. తెలంగాణను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక ముందడుగుగా నిలవనుంది

మేడ్చల్ – మల్కాజిగిరి

రాగా’స్ మ్యాచింగ్ బొటిక్ గ్రాండ్ ఓపెనింగ్

బాచుపల్లిలో నూతనంగా ప్రారంభమైన రాగా’స్ మ్యాచింగ్ బొటిక్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ జిల్లా బాచుపల్లి పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో రాగా’స్ మ్యాచింగ్ బొటిక్ నూతనంగా ప్రారంభమైంది. మల్లంపేట్ రోడ్డులోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ బొటిక్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అర్బన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ గిరివర్ధన్ రెడ్డి, మాజీ బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ మాదవరం కాంతారావు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులు హాజరై కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మార్చారు. మహిళల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల దుస్తులకు సరిపోయే మ్యాచింగ్ వస్తువులు, ఫ్యాషన్‌కు అనుగుణమైన ఎంపికలను అందించేందుకు రాగా’స్ మ్యాచింగ్ బొటిక్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాచుపల్లి, క్రాంతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ బొటిక్‌ను ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. రాగా’స్ మ్యాచింగ్ బొటిక్: క్రాంతి నగర్ కాలనీ, విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా, మల్లంపేట్ రోడ్, బాచుపల్లి, హైదరాబాద్.

హైదరాబాద్

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: తలసాని

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రి, ముసారాంబాగ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులకే రేవంత్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పాలన, దోపిడీ అంశాలపై వారం రోజులపాటు ప్రజల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఢిల్లీలోనే సీఎం, మంత్రులు గడుపుతున్నారని ఆరోపించారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

వాటర్ పొంగి పొర్లుతున్న పట్టించుకోని అధికారులు కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యం ఎన్ రెడ్డి నగర్ కాలనీ లో సర్వోత్తమ్ కంపెనీ నుండి ఎమ్ ఎన్ రెడ్డి నగర్ కాలనీ లో డ్రైనేజీ వాటర్ ఫుల్లుగా పారుతుండడం వలన కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదు ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఒక ట్యాంకర్ డ్రైనేజీ వాటర్ తీసిన తర్వాత మళ్లీ సేమ్ యధావిధిగా ఉంటున్నాయి ఆ డ్రైనేజీ వాటర్ పైనుంచి వస్తున్న వాటర్ మా కాలనీలోకి రోడ్లమీద ప్రవేశించి పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ గర్భ గుడిలో కూడా పోవటం వలన పంతులు, పూజ చేయాలన్న ప్రజలు వచ్చి దర్శనం చేసుకోవాలన్న చాలా ఇబ్బంది పడిపోతున్నారు అధికారులారా ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు వాపోతున్నారు అధికారులు ప్రజల సమస్యలను చూసి త్వరలో బాగు చేయాలని చేయని ఎడల మా కాలనీవాసులు అందరం కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కాలనీ ప్రజలు అన్నారు అధికారులు ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి ఈ డ్రైనేజీ వాటర్ ఎట్లా పోతుంది అనేది ఒకసారి పరీక్షించాలని ఆ డ్రైనేజీ వాటర్ రోడ్ల మీద పాడటం వలన బైకులు కార్లు వచ్చి పోయే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది విపరీతమైన దోమలు తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీలో ఉన్న సమస్యలను పరిస్కారం చేయాలని కాలనీవాసులు అధికారులకు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, శంకర్, భరత్, శివరామిరెడ్డి, వెంకట్ రెడ్డి, ఆనంద్, లక్ష్మీ మోహన్, చంద్ర మల్లికార్జున్, రాము, కృష్ణ కుమార్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

మేడ్చల్ – మల్కాజిగిరి

ప్రజల అవసరాలను తీర్చడమే ప్రథమ లక్ష్యo అభివృద్ధే మా ప్రాధాన్యం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

ఈరోజు 125 – గాజులరామారం డివిజన్ పెద్దమ్మ నగర్ లో దాదాపు 1.12 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రజల అవసరాలను తీర్చడమే తమ ప్రథమ లక్ష్యమని, అభివృద్ధే ప్రాధాన్యతగా పనిచేస్తున్నామని అన్నారు. గత 12 ఏళ్ల కాలంలో పెద్దమ్మ నగర్ బస్తీలో త్రాగునీటి సౌకర్యం, భూగర్భ డ్రైనేజీ సదుపాయంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించి నేడు సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో కూడా పెద్దమ్మ నగర్ బస్తి అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, పెద్దమ్మ నగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండుగుల నవీన్, ఉపాధ్యక్షులు దస్తగిరి ఖాన్, మనోహర్, ప్రధాన కార్యదర్శి రమేష్, సంయుక్త కార్యదర్శి జి ఎస్. శ్రీనివాస్, కోశాధికారి ఎండి. ఆరిఫ్, కె.రాము, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎస్. గోపాల్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, ఇబ్రహీం ఖాన్, తెలంగాణ సాయి, సాయిబాబా, నాగేష్, సుంకరి చందు, ఇమ్రాన్ బేగ్, చెట్ల వెంకటేష్, మూసాఖాన్, బోయిని మహేష్, చిన్న చౌదరి, బాబీ చౌదరి, ప్రసాద్, శ్రావణ్, అరుణ్, రాములు గౌడ్, శివా నాయక్, సమ్మయ్య యాదవ్, ఆసిఫ్, హమీద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గ పరిధిలోని మహదేవపురం డివిజన్‌కు చెందిన దొంపబోయిన శ్రీనివాస్ గారి కుమార్తె వివాహం KVS‌లో జరగగా, వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా, ఈనాడు పత్రిక విలేకరి నరసింహ గారి కుమార్తె వివాహం కొంపల్లిలోని AMR గార్డెన్స్‌లో జరగగా, వివాహ వేడుకకు హాజరైన కూన శ్రీశైలం గౌడ్ గారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు

మేడ్చల్ – మల్కాజిగిరి

డెంటల్ 360 ప్రారంభోత్సవంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి వాసులు డా. దివ్యశ్రీ నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ 360 క్లినిక్ను ముఖ్య అతిథిగా పాల్గొని *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లినిక్ యాజమాన్యం మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు అధునాతన సాంకేతికతతో కూడిన నాణ్యమైన దంత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం క్లినిక్‌లోని వైద్య సదుపాయాలు, అధునాతన పరికరాలను కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచిస్తూ, క్లినిక్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, డాక్టర్ సాయి హరీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.