తెలంగాణలో బియ్యం ధరలు మూడు నెలల్లోనే గణనీయంగా పెరిగాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం జూలైలో కిలోకు సగటు ₹54.40గా ఉన్న రిటైల్ బియ్యం ధర సెప్టెంబర్‌లో ₹61.60కు చేరింది. అంటే సుమారు 13.32 శాతం పెరుగుదల నమోదైంది. దేశంలో అత్యధిక ధరల పెరుగుదల నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధరలు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో బియ్యం ధరల భారీ పెరుగుదల