Tuesday, 22 September 2026

Tag: Telangana

హైదరాబాద్

22ఏ పేరుతో ప్రజల ఆస్తులకు సంకెళ్లు:కేటీఆర్

22ఏ కింద ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 30 శాతం కమిషన్ల కోసం ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపించారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లను నిషేధిత జాబితా నుంచి బేషరతుగా తొలగించి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. ధరణి ప్రజల ఆస్తులకు రక్షణ కవచంగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితి ‘భూభారతి కాదు.. భూ హారతి’గా మారిందని విమర్శించారు. అసైన్డ్‌ భూములను రెగ్యులరైజ్‌ చేసి ఎస్సీ, ఎస్టీలకు యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని, అప్పటి ప్రభుత్వ అక్రమాలన్నింటినీ వెలుగులోకి తెస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

నిజామాబాద్

పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే: మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరగడం శుభపరిణామమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పేరుతో ఓట్లు దండుకున్నప్పటికీ పేదలకు ఇళ్లు నిర్మించలేకపోయిందని విమర్శించారు. నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ₹720 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

తెలంగాణ

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు హేయం

అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యేల మెడ, జుట్టు పట్టుకుని లాగడం, చీర లాగడం దారుణమన్నారు. ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిపి, బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

తెలంగాణ

క్షమాపణ చెబుతారనుకున్నా: స్పీకర్

నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని భావించానని స్పీకర్ వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుకు మైక్ ఇచ్చింది కూడా క్షమాపణ చెబుతారనే ఉద్దేశంతోనని తెలిపారు. అయితే అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తాను స్పీకర్‌గా అన్ని వైపులా చూస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నానన్నారు. కడియం శ్రీహరిని ప్యానెల్ స్పీకర్‌గా పెడుతున్నట్లు చెప్పారు. గతంలో సబితా ఇంద్రారెడ్డితో రాజకీయంగా విభేదాలున్నా ఇలాంటి పరిస్థితులు రాలేదన్నారు.

తెలంగాణ

కేసీఆర్‌పై కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణ

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌పై దాడికి కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, వేముల వీరేశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ప్రవర్తన అభ్యంతరకరమని ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, కోవా లక్ష్మి పేర్కొన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ

కేసీఆర్ నివాస ముట్టడిపై ఆగ్రహం :ఎర్రోళ్ల శ్రీనివాస్

మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభ సమావేశాల్లో ఉండాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ నివాసం పరిసరాలకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్ష నేత ఇంటి ముట్టడికి కుట్ర పన్నడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. భువనగిరి నుంచి దళితులను వాహనాల్లో తరలించారని ఆరోపించారు. కేసీఆర్ నివాసంపై దాడికి పోలీసులకు ఎవరు ఆదేశాలిచ్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.

తెలంగాణ

గౌరవ సభ కాదు.. కౌరవ సభ|హరీశ్‌రావు

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికి, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపైనే తిరిగి కేసులు పెట్టడం దారుణమన్నారు. అసెంబ్లీ “గౌరవ సభ కాదు.. కౌరవ సభ”గా మారిందని విమర్శించారు. స్పీకర్‌పై తమకు పూర్తి గౌరవం ఉందని పేర్కొంటూ, దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. నల్ల టీషర్టులతో సభకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నల్గొండ

కేసీఆర్‌కు రేవంత్ సవాల్.. అసెంబ్లీకి రా.. లేదంటే రాజీనామా చేయి!

కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి నకిరేకల్ సభలో ఘాటుగా స్పందించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తమ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకోవాలని సవాల్ చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉద్యోగాల కల్పన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ లెక్కలపై చర్చించాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్‌లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

రంగారెడ్డి

పిఆర్టియూటీఎస్ ఉపాధ్యాయుల మహాధర్నా: హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో సిఎస్‌పి రద్దు, పిఆర్‌సి అమలు, పాత పెన్షన్‌ డిమాండ్లతో ఆందోళన

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పిఆర్‌టియూటీఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించారు. 33 జిల్లాల నుంచి దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయ సంఘ సభ్యులు తరలివచ్చి తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు.ప్రధాన డిమాండ్లుపిఆర్‌టియూటీఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ మూడు ప్రధాన డిమాండ్లను ముందుకెత్తారు:సిఎస్‌పి రద్దు – ఓపిఎస్ పునరుద్ధరణ: ప్రస్తుత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిఎస్‌పి)ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) పునరుద్ధరించాలి.పిఆర్‌సి తక్షణ అమలు: వేతన సవరణ సంఘం (పిఆర్‌సి)ని వెంటనే అమలు చేయాలి.2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్: 2003 డిఎస్‌సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి.రాష్ట్ర అధ్యక్షుడు పుల్లం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ పేరటి నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాకు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మద్దతు తెలిపి స్వయంగా పాల్గొన్నారు.మ్యానిఫెస్టో హామీలు ఎందుకు అమలు కాలేదంటే..ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ధర్నా వేదిక నుంచి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో మ్యానిఫెస్టోకు ఒక విలువ, ఒక విశ్వసనీయత ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే సిఎస్‌పి రద్దు చేస్తామని, అదేవిధంగా పిఆర్‌సి అమలు చేస్తామని, పెండింగ్ డిఎ లు, పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తామని చెప్పి మ్యానిఫెస్టో సాక్షిగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆ హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు” అని విమర్శించారు.గత ప్రభుత్వం 5 శాతం ఐఆర్ ఇచ్చి పిఆర్‌సి కమిటీ వేసిందని, ఇంకా 5 శాతం తక్కువ కొత్త పిఆర్‌సి వేస్తామని, ఆ కొత్త పిఆర్‌సి కూడా ఆరు నెలల కాలవ్యవధిలో అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన రెండు ప్రధాన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి ఇచ్చిన గడువులు – నెరవేరని వాగ్దానాలుధర్నా నాయకులు వివరించిన వివరాల ప్రకారం:మే రెండవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘ నాయకులతో సమావేశమై జూన్ 2 నాటికి పిఆర్‌సి కమిషన్ నివేదిక తెప్పిస్తానని, ఆ రోజు నుంచే ఉద్యోగుల వేతన సవరణ పూర్తిస్థాయిలో అమలు చేస్తానని హామీ ఇచ్చారు.సిఎస్‌పి విధానాన్ని రద్దు చేయాలని కోరగా అధ్యయనం కోసం కమిటీ వేస్తానని చెప్పారు.2003 డిఎస్‌సి ఉపాధ్యాయుల పాత పెన్షన్ సమస్యను డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకువెళ్తానని, పరిష్కరిస్తానని తెలిపారు.పెండింగ్ బిల్లుల్లో దాదాపు రూ. 6 వేల కోట్ల చెల్లింపులు జరిగినా ఏ ఒక్క సమస్య కూడా పూర్తిస్థాయిలో క్లియర్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.”గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఇకనైనా మీరిచ్చిన హామీను నిలబెట్టుకోండి. మాట ఇచ్చారు, మాటను నిలబెట్టుకోండి” — ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డితదుపరి పోరాట కార్యాచరణపిఆర్‌టియూటీఎస్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి స్పష్టం చేస్తూ, “ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని ప్రకటించారు. ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం:పిఆర్‌టియూటీఎస్ ఉద్యోగ జేఏసీలో భాగస్వామిగా ఉంది.జేఏసీ ఆధ్వర్యంలో పదో తేదీన రాష్ట్రవ్యాప్త ధర్నా జరగనుంది.ఆ ధర్నా అనంతరం జేఏసీతో సంప్రదింపులు జరిపి, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా జేఏసీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తామని తెలిపారు.ఇప్పటికైతే ఇందిరా పార్క్‌లో ధర్నా శిబిరాలు లేకుంటేనే “ఇందిరమ్మ రాజ్యానికి మంచి రోజులు వస్తాయి” అని సూటిగా హెచ్చరించారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.