Thursday, 7 May 2026

Tag: Telangana

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి విద్య విజ్ఞానం

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభ

*జపాన్ షెటోరియో షికోకాయ్ కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య* మంథని, ఆగస్టు 12; న్యూఢిల్లీలోని తాల్కటోర ఇండోర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించిన 19 వ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కప్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణ ద్వారా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన జపాన్ షెటోరియో షికొకాయ్ కరాటే విద్యార్థిని విద్యార్థులు అండర్ 17 అండర్ 14 కథ, కుమితే విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి వెండి, కాంస్య పథకాలు సాధించారు. మంథని పట్టణానికి చెందిన విద్యార్థులు అండర్ 17 కుమితే విభాగంలో ఎండీ. తహసిన్ తైభ వెండి పతకం, ఇదే క్రమంలో కథ విభాగంలో కాంస్య పథకం, అండర్ 14 కుమితే విభాగంలో పోగుల శివ సాకేత్ కాంస్య పథకం, బండారి మణికంఠ కథ విభాగంలో కాంస్య పథకం, మారేడుకొండ రిషి కథ విభాగంలో కాంస్య పథకం సాధించినట్లు శిక్షకులు కావేటి సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షకులు కావేటి సమ్మయ్య మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుండి మంథని పట్టణంలో ఉచిత కరాటే శిక్షణ ఇస్తూ, అంతర్జాతీయ, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. మలేషియాలో బంగారు, వెండి పథకం, హర్యానాలో బంగారు పతకం, మధ్యప్రదేశ్లో బంగారు పతకం, గోవాలో బంగారు పతకం, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థులు సాధించడానికి ఎంతో మంది విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉచిత కరాటే శిక్షణ ఇవ్వడమే కాకుండా, పేద విద్యార్థులకు పోటీలకు వెళ్లేటప్పుడు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తున్నట్లు సమ్మయ్య పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రోత్సహించి, దాతలు సహకరిస్తే, ఇంకా ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తానని సమ్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఉచిత కరాటే శిక్షణ కోసం ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు మంథని పట్టణంలోని ఓపెన్ జిమ్ దగ్గర లేదా సమ్మయ్య నివాసం దగ్గర ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 5 గంటలకు, లేదా 9848503412 నంబర్ ను సంప్రదించాలని కావేటి సమ్మయ్య కోరారు. ఈ పథకాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను షిటోరియు షికొకాయ్ ఇండియా అధ్యక్షులు, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఢిల్లీ భరత్ శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ శిఖోకాయి రిప్రెజెన్టివ్ పాలకుర్తి పాపయ్య, తెలంగాణ కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగలి రాకేష్, జడగల శివాని, కాబట్టి శివ గణేష్, మెట్టు హాసిని, కే శ్వేత, నందన, టి హర్షిని, పి హర్షవర్ధన్ లు అభినందించారు.

తెలంగాణ హైదరాబాద్

తెలంగాణలో 13 నుండి 16 వరకు అతి భారీ వర్షాలు..!

హైదరాబాద్, ఆగస్టు 12, పున్నమి ప్రతినిధి: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల ఆగస్టు 13 నుంచి 16 వరకు వరుసగా మూడు రోజులు పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు బలంగా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ వాతావరణం: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా ఉంది. నేటి సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములు, మెరుపులు పడే అవకాశమూ ఉంది.ఆగస్టు 12 నుంచి 16 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సలహా ఇచ్చింది.

తెలంగాణ పెద్దపల్లి

గుంజపడుగు: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆగస్టు 11, పున్నమి ప్రతినిధి: రైతులను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. సోమవారం మంథని ప్రాంతంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కరీంనగర్ డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు లతో కలిసి మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రెండు గోదాములకు, గుంజపడుగు గ్రామంలో 2 కోట్ల 90 లక్షల రూపాయలతో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో గుంజపడుగు శివారులో పి.ఎం కుసుమ్ క్రింద 3.5 కోట్ల రూపాయలతో 1 మెగా వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో నంది మేడారం, కాల్వ శ్రీరాంపూర్, అప్పన్న పేట, మంథని ప్రాంతాలలో 1 మెగా వాట్ చోప్పున ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 4 నెలల కాలంలో ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, గ్రిడ్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. చిల్లపల్లి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాము లను 7 కోట్ల రూపాయలతో చేపట్టామని అన్నారు. గుంజపడుగు ప్రాంతంలో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆర్.బి.ఐ కు పంపాలని మంత్రి సూచించారు. సహకార శాఖ లో 20 సంవత్సరాల కాలంగా తన వంతు కృషి చేస్తున్న కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతు సోదరులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనుబంధ రంగాలైన గోదాముల నిర్మాణం, పి.ఏ.సి.ఎస్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు లాంటి కార్యక్రమాల వల్ల రైతులను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ గౌడ్, మంథని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్డిఓ సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహశీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు

భారతీయ సంస్కృతిలో రాఖీ పండుగ రోజు అన్న, తమ్ములకు ఆడబిడ్డల ఆశీర్వాదం హైదరాబాద్, ఆగస్టు 09, పున్నమి ప్రతినిధి; రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. రాఖీపౌర్ణమి నాడు నిత్యపూజలు చేసి ఇంటిలో ఒక చోట ముగ్గు, పీట వేసి సోదరుడుని కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టవలెను. మిఠాయిలు తినిపించవలెను. సోదరుడు కృతజ్ఞతగా తన సోదరికి ధనము, బట్టలు, నగలు గానీ కానుకగా ఇవ్వడం ఆచారం. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్పగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల || -పై శ్లోకాన్ని పఠిస్తూ సోదరి-సోదరునకు విజయ ప్రాప్తి కోసం సోదరుని ముంజేతికి రాఖీ కట్టవలెను. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం.

తెలంగాణ పెద్దపల్లి

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

*మంథని: అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు* మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రం అంబేద్కర్ నగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు ఈ సమావేశాల్లో అంగన్వాడి ఉపాధ్యాయురాలు మండల సుగుణ పలు సూచనలు చేశారు. చిన్నారులకు ఆరు నెలల వయసు వచ్చేవరకు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించాలని ఆమె సూచించారు. కొందరు తల్లిదండ్రులు రసాయన మిశ్రమాలతో తయారు చేసిన కృత్రిమ పాలు తాగించి, పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలే ముద్దని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయు రాలు మండల సుగుణ తో పాటు.. అంగన్వాడి ఆయా రాజేశ్వరి, కాచర్ల కళావతి, కరెంగల రంజిత, పీక శృతి, కట్ల సౌందర్య, మంథిని చైతన్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజు

వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజు మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి; పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులు గురువారం పట్టణ పరిధిలోని గోదావరి తీరంలో ప్రత్యేక నమాజు నిర్వహించారు. సంవృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు, ప్రజలకు అల్లా దయ, కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని సాలెహా మజీద్ కు చెందిన ఇమాంసాబ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. అనంత కరుణామయుడు అల్లా దయతో ప్రకృతి కటాక్షించి సంవృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక నమాజులు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా వరుసగా మూడు రోజులు నమాజులు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రతిరోజు చేసే నమాజుకు ఈ ప్రార్థనలు ప్రత్యేకమని వివరించారు. ఇదే క్రమంలో ముస్లిం పెద్దలు సర్దార్ ఖాన్, మక్బూల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వానాకాలం వచ్చి దాదాపు రెండు నెలలు దాటినా ఇంతవరకు పరిసర ప్రాంతాల్లో సరైన వానలు లేక ప్రజలు అల్లాడుతున్నారని, వర్షాలు లేకుంటే రైతులకు సరైన పంటలు పండక అవస్థలు పడుతున్నారని, అల్లా దయతో వర్షాలు కురిసి, పంటలు పండితే ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మంథని పట్టణంలోని సాలెహా మజీద్ కమిటీ అధ్యక్షుడు యాకూబ్, ఆఫిజ్, ఎండీ లతీఫ్, మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలీం ఖాన్, చాంద్, అక్బర్, శంశీర్, షాహిద్, ఐసన్, నిజాం, అంజద్, అజీమ్, హైమద్, బాబా, మోహిన్, పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఖమ్మం జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పెద్దపల్లి

ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం

మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి కేంద్ర మంత్రి జితేంద్ర మాంజిని కలిసి విజ్ఞప్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు న్యూఢిల్లీ, ఆగస్టు 06, పున్నమి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం MSME (మైక్రో, చిన్న మరియు మధ్యతరః పరిశ్రమల) రంగ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రెండు కొత్త MSME పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంజీ కి వివరించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి , కలిసి విజ్ఞప్తి చేసి లేఖను అందించారు. MSME రంగం సమగ్ర ఆర్థిక ప్రగతికి కీలక క్షేత్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఖమ్మం జిల్లా మధిర మండలంలోని యెండపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రె మిడిచర్ల గ్రామాల్లో MSME పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, వరుసగా 85 ఎకరాలు మరియు 60 ఎకరాల్లో ఈ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ రహదారి 65 (హైదరాబాద్–విజయవాడ కారిడార్) కు సమీపంలో ఉండటంతో, వీటి భౌగోలిక స్థానం వ్యూహాత్మకంగా ఉందనీ, సమీప పట్టణాలు, రైల్వే నెట్వర్క్‌లు, పోర్టులతో అనుసంధానం ఉందనీ తెలిపారు. ఈ పార్కుల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయనీ తెలిపారు. ఈ పార్కులు వివిధ తయారీ రంగాలకు అనుకూలంగా అభివృద్ధి చేయబడి, కనీసం 5,000 ప్రత్యక్ష మరియు 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలవనే అంచనాలతో ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. MSME-CDP పథకం కింద ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది.తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనMSME-CDP పథకం కింద కేంద్ర నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం MSME రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించిందనీ, రాష్ట్రంలోని ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో (మొత్తం 119) చిన్న స్థాయి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలతో కూడిన MSME పార్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, ఈ పార్కులు, చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించి, నడిపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని అందించనున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు.ఈ MSME పార్కుల్లో హాస్టళ్లు, కిచెన్లు, టాయిలెట్లు, టెస్టింగ్ సెంటర్లు, ఇతర సాధారణ వసతులు ఉంటాయనీ, వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి ఆవిష్కరణ, మార్కెట్ వ్యూహం వంటి సేవలు అందుబాటులో ఉంటాయనీ, మహిళా ప్రాధాన్యత గల సంస్థలకు ప్రోత్సాహంగా స్ట్రీనిధి పథకం ద్వారా రుణాల మద్దతు కూడా ఇవ్వనున్నామని కేంద్రమంత్రికి వివరించారు. దీని ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు బలోపేతం కావడంతోపాటు, జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయనీ,ప్రస్తుతం MSME-CDP పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 ప్రాజెక్టులను కేంద్ర MSME మంత్రిత్వ శాఖ సహకారంతో అమలు చేస్తోందనీ, వీటిలో ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో MSME వ్యవస్థను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనీ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం, కేంద్ర MSME మంత్రిత్వ శాఖ మద్దతుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా MSME పార్కులను నెలకొల్పడానికి సంబంధిత పథకాల ద్వారా ఆర్థిక సహాయం కోరుతోంది. ఈ ప్రయోజనాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి ఎదుట వ్యక్తం చేశారు.

తెలంగాణ పెద్దపల్లి వరంగల్

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించిన పోలీస్ డాగ్

రామగుండం పోలీస్ కమీషనరేట్ నార్కోటిక్ డాగ్ “సింబా” ఎంపిక రామగుండం, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: వరంగల్ జిల్లా మమునూరు పిటిసిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ లో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డాగ్ విభాగం పోటీలో పాల్గొనీ గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడం లో పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వేణుగోపాల్ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిదంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్ గా “సింబా” ఎంపిక కావడం జరిగింది. సోమవారం రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తమ కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా, డాగ్ హాండ్లర్ ను అభినందించడం జరిగింది. 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీసు డ్యూటీ మీట్ లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి, రామగుండం పోలీస్ కమీషనరేట్ కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ పి. కరుణాకర్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, సంపత్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సినిమా హైదరాబాద్

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!

*తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!* హైదరాబాద్, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌ గా సంజీవ్ గోయెంకా ను కో-ఛైర్మన్‌ గా ఉపాసన కొణిదెల నియమించారు. అపోలో హాస్పిటల్స్‌ లో CSR వైస్ ఛైర్‌ పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఆరోగ్యం, ఫిట్‌నెస్, యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం , క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి, ప్రైవేట్ సంస్థలు, నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ

తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం హైదరాబాద్, ఆగస్టు 05, పున్నమి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం మంగళవారం, బుధవారం (ఆగస్ట్ 5, 6) తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్ష సూచన రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమూ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇతర చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈదురుగాలుల తీవ్రత వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హవామాన శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచనలిచ్చింది. హెచ్చరికలు: గగనతల విద్యుత్‌ స్ఫోటాల నుంచి జాగ్రత్తగా ఉండాలనీ, విద్యుత్ లైన్‌ల దగ్గరగా వెళ్లకుండా ఉండాలనీ, రైతులు పొలాల్లో ఉండే సమయాన్ని తగ్గించుకోవాలనీ, నీటి ప్రవాహాల వద్ద, పురుగు మందుల పిచికారీ సమయంలో సురక్షిత దూరం పాటించాలనీ సంబంధిత అధికారులు ముందస్తు సూచనలు జారీ చేశారు. రైతులకు సూచన: వర్షాభావ పరిస్థితులు మారే సూచనలు ఉన్నందున సాగు కార్యక్రమాలను వాయిదా వేయవచ్చు. వర్షపాతం ఆశించదగిన పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ సలహా ఇచ్చింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.