Wednesday, 23 September 2026

Tag: Hyderabad

తెలంగాణ

భూములపై రేవంత్ కన్ను : హరీశ్ రావు

కేసీఆర్ గారి పాలన ప్రజల కేంద్రంగా సాగితే, సీఎం రేవంత్ రెడ్డి పాలన భూముల కేంద్రంగా సాగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు, భూములను విక్రయించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఆరోపించారు. ఇప్పటికే సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ విక్రయించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో కాంగ్రెస్ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

హైదరాబాద్

సుమంత్ కేసులో సీఐ సస్పెండ్

జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో విధుల పట్ల అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సుమంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేయడంతో పాటు, అతడిని పట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంబంధిత సీఐని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్

తెలంగాణ పెట్టుబడులకు కేంద్రం అడ్డంకి

తెలంగాణ రైజింగ్ ప్రణాళికలో భాగంగా విద్య, క్రీడా రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇంగ్లాండ్, అమెరికా పర్యటనలు చేపట్టాలని భావించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం ముందుగానే కేంద్రానికి వివరాలు ఇచ్చినా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారని ఆరోపించారు. బోస్టన్, హార్వర్డ్ వంటి ప్రముఖ విద్యాసంస్థల క్యాంపస్‌లను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యమన్నారు. తన పర్యటనను అడ్డుకున్నా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కేంద్ర వైఖరిని తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా అభివర్ణించారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

యూపీ బీహార్ సోదరులు నిర్వహించే కావడి యాత్రలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు

యూపీ బీహార్ లు శ్రావణమాసం, మహాశివరాత్రి సందర్భాలలో ప్రత్యేకంగా నిర్వహించే కావడి యాత్ర సోమవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగు బస్తి నుండి హెచ్ఎంటి శివాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు హాజరై కావడి ని మోసి బిహారీ భక్తులకు శ్రావణమాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ గారు మాట్లాడుతూ పవిత్ర శ్రావణమాసంలో బిహారీలు పవిత్ర గంగాజలంతో శివునికి అభిషేకం చేయడం ద్వారా వారి మొక్కులను తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ అన్ని ప్రాంతాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు నిలయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ధర్మేందర్, మంజుల, జగదీష్ పాల్, రమేష్, రాజ్ కుమార్, సంతోష్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టుపక్కల స్థలాల కబ్జా రిలే నిరాహార దీక్ష

జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 14 ఎకరాల 10 గుంటల దేవాదాయ భూమిని తక్షణమే సర్వే చేసి, సరిహద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించాలని ఆకుల సతీష్ టీమ్ డిమాండ్ చేసింది. తెలంగాణ హైకోర్టు W.P.No.40409/2025లో 10-04-2026న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రెవెన్యూ, ఎండోమెంట్స్, సర్వే అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి భూమిని పరిరక్షించాల్సి ఉందని ఆకుల సతీష్ తెలిపారు. దేవాలయాలకు రాకపోకల కోసం రహదారి కల్పించడంతో పాటు, దేవాదాయ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పది రోజుల్లో సర్వే, ఫెన్సింగ్ పనులు ప్రారంభించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజలతో కలిసి భారీ నిరసన చేపడతామని, కోర్టు ఆదేశాల అమలుకు మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని ఆకుల సతీష్ హెచ్చరించారు. “దేవుడి మాన్యం భూమిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత. కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలి.” — ఆకుల సతీష్ టీమ్

హైదరాబాద్

సురేఖపై వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు?

తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. ఇప్పటికే నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ తనపై బహిరంగ విమర్శలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమా అనే అంశాన్ని పరిశీలించాలని కోరారు. పార్టీ క్రమశిక్షణ, సామాజిక న్యాయం, మహిళల గౌరవానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు.*

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ భౌరంపేట్ లోని పెద్ద చెరువు కట్ట మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ మరియు ఇందిరమ్మ కాలనీలోని నడిగడ్డ నాగులమ్మ ఎల్లమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు..* *ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*

హైదరాబాద్

అక్రమ నిర్మాణాల తొలగింపు

మాదాపూర్లోని అంజయ్యనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలన్నింటినీ తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ భవనాలు నాలాల పక్కనే ఉన్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమన్నారు. హాస్టళ్లను నిర్మిస్తున్న సదరు బిల్డర్‌పై ఫిర్యాదులు వస్తున్నాయని, అతడి అక్రమ నిర్మాణాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Uploaded Video:

హైదరాబాద్

రాయదుర్గంలో రికార్డు ధర: ఎకరం రూ.264 కోట్లు!

రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 83/1 భూములకు వేలంలో ఊహించని రీతిలో రికార్డు ధర లభించింది. TGIIC నిర్వహించిన వేలంలో ఇక్కడ ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లు పలికింది. మొత్తం 5.25 ఎకరాల భూమికి వేలం నిర్వహించగా, ఇది ఇప్పటివరకు జరిగిన భూముల వేలంలోనే సరికొత్త ఆల్టైమ్ రికార్డుగా నిలిచింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ వేలం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.

హైదరాబాద్

ఎంపీ కుమారుడు సంజూష్‌పై కేసు

మాదాపూర్‌లో ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. ఈ నెల 16న సంజూష్ నడిపిన కారు ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారును సంజూష్‌నే నడిపినట్లు నిర్ధారించిన పోలీసులు, అతనిపై BNS సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.