కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి వాసులు డా. దివ్యశ్రీ నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ 360 క్లినిక్ను ముఖ్య అతిథిగా పాల్గొని *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్లినిక్ యాజమాన్యం మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు అధునాతన సాంకేతికతతో కూడిన నాణ్యమైన దంత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం క్లినిక్‌లోని వైద్య సదుపాయాలు, అధునాతన పరికరాలను కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచిస్తూ, క్లినిక్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, డాక్టర్ సాయి హరీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.


