1947లో ఆవిర్భావం.. 2027లో 80వ వార్షికోత్సవం
ఆరవల్లి ప్రాంతంలో చేనేత రంగ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న శ్రీ మార్యండేయ చేనేత పారిశ్రామిక సహకార వృత్తి విక్రయ సంఘం లిమిటెడ్2027 ఫిబ్రవరి 10 నాటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సంఘం 1947 ఫిబ్రవరి 10న స్థాపించబడగా, అదే సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రారంభమైనట్లు సంఘం వివరాలు వెల్లడిస్తున్నాయి.
చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, సంప్రదాయ వస్త్ర కళల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం ఎనిమిది దశాబ్దాలుగా తన సేవలను కొనసాగిస్తోంది. సంఘ చరిత్రకు గుర్తుగా 1947లో తీసిన సభ్యుల సమూహ చిత్రాన్ని భద్రపరుస్తూ, నాటి చేనేత కార్మికుల సేవలను స్మరించుకుంటున్నారు.
సంఘం 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1947–2027 కాలాన్ని గుర్తుచేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. పాతతరం చేనేత కార్మికుల కృషిని నేటి తరానికి పరిచయం చేయడంతో పాటు, సహకార వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ వేడుకల ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
“మన పూర్వీకుల కృషి – మన సమాజ అభివృద్ధికి పునాది” అనే సందేశంతో 80వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు.
ఇది 19 47 స్వతంత్రం రాకముందు పద్మశాలి చేనేత సహకార సంఘం ఏర్పాటు చేసిన మా తాతలు పొన్నగంటి అప్పలస్వామి పొన్నగంటి సంజీవ్ సంజీవ్ ఇది ఎప్పటిదో ఫోటో దొరికింది దీన్ని బట్టి వారి మనవడు పొన్నగంటి అప్పారావు పద్మశాలి ఈ విషయాన్ని మనకు తెలియజేశారు


