Sunday, 26 July 2026
  • Home  
  • దుత్తలూరులో భారీ చోరీ.. నర్రవాడ బీసీ కాలనీలో కలకలం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో భారీ చోరీ.. నర్రవాడ బీసీ కాలనీలో కలకలం

దుత్తలూరు, జూలై 25 (పున్నమి ప్రతినిధి) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ బీసీ కాలనీలో శనివారం భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి నగదు, విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరిస్తూ ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. వరుస చోరీల ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

దుత్తలూరు, జూలై 25 (పున్నమి ప్రతినిధి)

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ బీసీ కాలనీలో శనివారం భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి నగదు, విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరిస్తూ ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. వరుస చోరీల ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.