Wednesday, 19 August 2026

Tag: సోషల్ ఆక్టివిటీ

ఖమ్మం

డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి: డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు పిలుపు..

ఖమ్మం జిల్లా బోనకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో నషాముక్త్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మత్తు పదార్థాలు, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత, బీజేపీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు డాక్టర్ జి.వి. గోంగూర వెంకటేశ్వర్లు, ఖమ్మం నగర గౌడ సంఘం అధ్యక్షులు బంధం హనుమంతరావు పాల్గొని డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశ కీలకమని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఫ్రూట్స్ అందించి, ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అట్లూరి గోపీచంద్, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ భుక్యా సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.