Thursday, 24 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

ఇంటింటికీ తెలుగుదేశం.. టీడీపీ జెండా ఎగరాలి! ప్రగడ నాగేశ్వరరావు పిలుపు

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి, సెప్టెంబర్ 13: యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఏపీఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆదివారం తెరువుపల్లి 4వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. వీధివీధినా తిరుగుతూ ప్రజలను కలుసుకుని తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నానాజీ, కొటారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, దాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

అనకాపల్లిలో కుక్కల మాయం.. ‘మాఫియా’పై ఆరోపణలు..

3 వేలు కుక్కలు కనిపించడంలేదని ఆరోపణ.. ఒక్కో కుక్కకు రూ.1,650 చెల్లింపులపై ప్రశ్నలు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో వీధి కుక్కల సంరక్షణ, తరలింపు వ్యవహారంపై వివాదం నెలకొంది. సుమారు 3 వేల కుక్కలు కనిపించకుండా పోయాయని జిల్లా వీఎస్పీ నంబర్ శ్రీదేవి ఆరోపించారు. సుంకరమెట్ట జంక్షన్ సమీపంలోని ఏపీఎస్ కేంద్రం సంరక్షణ కేంద్రంలో పట్టుకున్న కుక్కల పరిస్థితిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. కుక్కలను పట్టుకుని సంరక్షణ కేంద్రాలకు తరలించే ప్రక్రియలో ఒక్కో కుక్కకు రూ.1,650 చొప్పున చెల్లింపులు జరుగుతున్నాయని శ్రీదేవి ఆరోపించారు. గత నెల 4వ తేదీన కుక్కలు మాయమైనట్లు అనకాపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఆమె పేర్కొన్నారు. అదృశ్యమైన కుక్కలను ఇతర రాష్ట్రాలకు తరలించి మాంసంగా విక్రయిస్తున్నారనే అనుమానాలను కూడా శ్రీదేవి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె కోరారు. కుక్కల సంరక్షణ కేంద్రాల నిర్వహణ, కుక్కల సంఖ్య, తరలింపు వివరాలు, చెల్లింపులపై పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

అనకాపల్లి

అనకాపల్లి మండలంలో పల్లె నిద్ర కార్యక్రమం..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గ్రామంలో ఉండే సామాజిక, సాంఘిక, రాజకీయ పరిణామాలు అర్ధం చేసుకొను నిమిత్తం పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న అనకాపల్లి మండలం లో అత్యంత సమస్యాత్మక గ్రామమైన మామిడిపాలెం గ్రామంలో అనకాపల్లి రూరల్ పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువత మరియు గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సత్ప్రవర్తనతో మెలగాలని, గొడవలకు, వర్గ విభేదాలకు దూరంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు. సాధారణ సమయాల్లో జరిగే గొడవల కన్నా, ఎలక్షన్ సమయంలో జరిగే గొడవలపై మరియు ఆ కేసుల్లోని నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా నిరంతరం వారిపై నిఘా ఉండేలా రౌడీ షీట్లు తెరవడం, సత్ప్రవర్తన కలిగి ఉండేలా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

అనకాపల్లి

అత్యాధునిక వైద్య సేవలకు కేంద్రంగా అనకాపల్లి జిల్లా ఆసుపత్రి..

ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిని అన్ని రకాల వైద్య సేవలు అందించే సమగ్ర వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. అత్యవసర వైద్యం కోసం ప్రజలు విశాఖపట్నం లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, డిప్యూటీ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి విడతలో మంజూరైన క్రిటికల్ కేర్ సెంటర్లలో అనకాపల్లి కేంద్రాన్ని చేర్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. సుమారు రూ.22.09 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు కాగా, మరో రూ.7.50 కోట్ల విలువైన వైద

అనకాపల్లి

మట్టి గణపతినే పూజిద్దాం.. మహాగణపతిగా భావిద్దాం..!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : విశాఖపట్నం :ఆంధ్రప్రదేశ్ ప్రదేశీక్ మార్వరి సమ్మేళన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖపట్నం మార్వారీ సమ్మేళన్ అధ్యక్షులు పోడే శ్వర్ పురోహిత్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ సమీపంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోడేశ్వర్ పురోహిత్ మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించి ప్రకృతిని కాపాడదామని పిలుపునిచ్చారు. పార్వతీదేవి పసుపుతో సృష్టించిన గణనాధుని స్ఫూర్తితో మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్(యూజేఎఫ్) అధ్యక్షులు డాక్టర్. ఎం. ఆర్. ఎన్. వర్మ మాట్లాడుతూ ప్రకృతిని ఆర్తితో కాపాడుకుందాం. వినాయక చవితి పేరుతో ప్లాస్టపరస్ వివిధ రంగుల రసాయనాలతో వ్యాపార ద్వారానికి స్వస్తి పలుకుదాం. మట్టి గణపతి లను పూజించడం ద్వారా నదులను, చెరువులను స్వచ్ఛంగా ఉంచడానికి వీలు పడుతుందన్నారు. రసాయన రంగులతో కూడిన వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వలన నీటిలోని జీవరాసులకు హాని కలగడంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. స్వచ్ఛమైన ప్రకృతిని భావితరాలకు అంకితం చేద్దాం. ఈ కార్యక్రమంలో విశాఖ మార్వారీ సమ్మేళన్ సభ్యులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏచూరి ఆశయాల సాధనే నిజమైన నివాళి

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : అచ్యుతాపురం: సీపీఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా అచ్యుతాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీపీఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్. రాము మాట్లాడుతూ తెలుగు బిడ్డగా పుట్టిన ఏచూరి దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. జేఎన్‌యూ విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు కృషి చేశారని పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన 21వ పార్టీ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పి.నాయుడు, పాలికల అప్పలరాజు, రెడ్డి అప్పలనాయుడు, రాజన్న అప్పలకొండ, లాలం రామ్‌నాయుడు, రాజన్న సత్తిబాబు, దొడ్డి నాగరాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

గ్రీన్ గణేష్‌తో పర్యావరణ పరిరక్షణకు పిలుపు

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : అనకాపల్లి: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో గ్రీన్ గణేష్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. GVMC హైస్కూల్, రాజా థియేటర్ ఎదురుగా జరిగిన కార్యక్రమంలో 3,500 మట్టి వినాయక విగ్రహాలతో పాటు వ్రతకథ పుస్తకాలు, పూజా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి వినాయకులను వినియోగించడం ద్వారా నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చని ఆయన అన్నారు. గ్రీన్ క్లబ్ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. క్లబ్ వ్యవస్థాపకులు కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

అనకాపల్లి

మంచినీటికి ఇదేం దుస్థితి..! ట్యాంకు పొంగిపొర్లుతున్నా పట్టించుకోని అధికారులు.. చిన్నగుమ్ములూరులో వృథాగా నీరు

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 13: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ములూరు గ్రామంలో తాగునీటి ట్యాంకు నిండిపోయి మంచినీరు వృథాగా రోడ్లపైకి ప్రవహిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువైన తాగునీటిని పొదుపుగా వినియోగించాల్సిన సమయంలో ట్యాంకు నిండిన తర్వాత కూడా నీరు బయటకు పొంగిపొర్లుతూ రోడ్లను తడుపుతోంది. దీంతో నీటి వృథాతో పాటు రహదారిపై నీరు నిలిచి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను గుర్తించి ట్యాంకు వద్ద నీటి ప్రవాహాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకు పొంగిపొర్లకుండా శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు వృథా అవుతున్న మంచినీటిని అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అనకాపల్లి

పోలింగ్ కేంద్రాల ముసాయిదాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష.

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి : పురపాలక సంఘ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పట్టణంలోని 32 వార్డులకు సంబంధించి 63 పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్కులర్ నెం. 525/ఎస్ఈసి- ఎఫ్2/2026 నిబంధనల మేరకు మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలపై సూచనలు, సలహాలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ చర్చలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్లి నానాజీ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బొద్ధపు శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బెజవాడ నాగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి షేక్ రహీం బీబీ పాల్గొని తమ అభిప్రాయాలను, సూచనలను లిఖితపూర్వకంగా మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నెల 13వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి జే యస్. ప్రసాద్ రాజు స్పష్టం చేశారు.

అనకాపల్లి

స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : నాయకులందరూ పార్టీ సిద్దాంతాలు పాటించాలి.అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలి.ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం,అడ్డరోడ్డు శ్రీ శ్రీనివాసా కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు పాయకరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ కంబాల జోగులు గారి అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాల్గొన్న పెద్దలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా పరిపాలన ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు.మన ప్రభుత్వ హయాంలో జగనన్న చేసిన అభివృద్ధి,ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పుకోలేకపోయాము.అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రామ సచివాలయం వ్యవస్థ,రైతు భరోసా కేంద్రాలు,విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రోడ్లు ఇప్పుడు మేమే చేశాం అని ప్రచారాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అబద్ధాలతో అధికారం కట్టబెట్టుకున్నారు. చేసింది గోరింత చెప్పుకోవడం కొండంత,సంక్షేమం శూన్యం చంద్రబాబు చేసిన మోసాలు గ్రామాల్లో చేరవేయాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు మన పార్టీ అభ్యర్థులు గెలవాలి,పార్టీకి తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తలకు అండగా ఉంటాం అని అన్నారు.ఏ ఒక్క గ్రామంలో కూడా ఏకగ్రీవం అనే ప్రసక్తే ఉండకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు,ఎంపీపీలు,మండల పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గం, మండలాల,వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు,వైఎస్సార్సీపీ కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.