Sunday, 13 September 2026
  • Home  
  • మట్టి గణపతినే పూజిద్దాం.. మహాగణపతిగా భావిద్దాం..!
- అనకాపల్లి

మట్టి గణపతినే పూజిద్దాం.. మహాగణపతిగా భావిద్దాం..!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : విశాఖపట్నం :ఆంధ్రప్రదేశ్ ప్రదేశీక్ మార్వరి సమ్మేళన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖపట్నం మార్వారీ సమ్మేళన్ అధ్యక్షులు పోడే శ్వర్ పురోహిత్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ సమీపంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోడేశ్వర్ పురోహిత్ మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించి ప్రకృతిని కాపాడదామని పిలుపునిచ్చారు. పార్వతీదేవి పసుపుతో సృష్టించిన గణనాధుని స్ఫూర్తితో మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్(యూజేఎఫ్) అధ్యక్షులు డాక్టర్. ఎం. ఆర్. ఎన్. వర్మ మాట్లాడుతూ ప్రకృతిని ఆర్తితో కాపాడుకుందాం. వినాయక చవితి పేరుతో ప్లాస్టపరస్ వివిధ రంగుల రసాయనాలతో వ్యాపార ద్వారానికి స్వస్తి పలుకుదాం. మట్టి గణపతి లను పూజించడం ద్వారా నదులను, చెరువులను స్వచ్ఛంగా ఉంచడానికి వీలు పడుతుందన్నారు. రసాయన రంగులతో కూడిన వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వలన నీటిలోని జీవరాసులకు హాని కలగడంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. స్వచ్ఛమైన ప్రకృతిని భావితరాలకు అంకితం చేద్దాం. ఈ కార్యక్రమంలో విశాఖ మార్వారీ సమ్మేళన్ సభ్యులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :

విశాఖపట్నం :ఆంధ్రప్రదేశ్ ప్రదేశీక్ మార్వరి సమ్మేళన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,
విశాఖపట్నం మార్వారీ సమ్మేళన్ అధ్యక్షులు పోడే శ్వర్ పురోహిత్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ సమీపంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోడేశ్వర్ పురోహిత్ మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించి ప్రకృతిని కాపాడదామని పిలుపునిచ్చారు. పార్వతీదేవి పసుపుతో సృష్టించిన గణనాధుని స్ఫూర్తితో మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్(యూజేఎఫ్) అధ్యక్షులు డాక్టర్. ఎం. ఆర్. ఎన్. వర్మ మాట్లాడుతూ ప్రకృతిని ఆర్తితో కాపాడుకుందాం. వినాయక చవితి పేరుతో ప్లాస్టపరస్ వివిధ రంగుల రసాయనాలతో వ్యాపార ద్వారానికి స్వస్తి పలుకుదాం. మట్టి గణపతి లను పూజించడం ద్వారా నదులను, చెరువులను స్వచ్ఛంగా ఉంచడానికి వీలు పడుతుందన్నారు. రసాయన రంగులతో కూడిన వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వలన నీటిలోని జీవరాసులకు హాని కలగడంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. స్వచ్ఛమైన ప్రకృతిని భావితరాలకు అంకితం చేద్దాం. ఈ కార్యక్రమంలో విశాఖ మార్వారీ సమ్మేళన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.