Sunday, 13 September 2026
  • Home  
  • ఏచూరి ఆశయాల సాధనే నిజమైన నివాళి
- అనకాపల్లి

ఏచూరి ఆశయాల సాధనే నిజమైన నివాళి

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : అచ్యుతాపురం: సీపీఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా అచ్యుతాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీపీఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్. రాము మాట్లాడుతూ తెలుగు బిడ్డగా పుట్టిన ఏచూరి దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. జేఎన్‌యూ విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు కృషి చేశారని పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన 21వ పార్టీ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పి.నాయుడు, పాలికల అప్పలరాజు, రెడ్డి అప్పలనాయుడు, రాజన్న అప్పలకొండ, లాలం రామ్‌నాయుడు, రాజన్న సత్తిబాబు, దొడ్డి నాగరాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :

అచ్యుతాపురం: సీపీఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా అచ్యుతాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీపీఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్. రాము మాట్లాడుతూ తెలుగు బిడ్డగా పుట్టిన ఏచూరి దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. జేఎన్‌యూ విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు కృషి చేశారని పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన 21వ పార్టీ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పి.నాయుడు, పాలికల అప్పలరాజు, రెడ్డి అప్పలనాయుడు, రాజన్న అప్పలకొండ, లాలం రామ్‌నాయుడు, రాజన్న సత్తిబాబు, దొడ్డి నాగరాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.