ఖమ్మంలో జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన మధు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా కిరణ్, బీజేపీ జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, డీకొండ శ్యాం హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పున్నమి న్యూస్ తో గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ ఖమ్మం నగరము లో ABVP రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం సంతోషకర విషయం అని ఖమ్మం నగరాన్ని కాషాయపు మయం చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలకీ అభినందనలుఅని అన్నారు



