Thursday, 24 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

ఓజోన్‌ను కాపాడుదాం.. భూమిని రక్షిద్దాం..!

ఎరుకువానిపాలెం, అనకాపల్లి మండలం – పున్నమి ప్రతినిధి ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎరుకువానిపాలెం ఎం.పి.యు.పి. పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, ఏపీ జీవ వైవిధ్య సంరక్షణ అవార్డు గ్రహీత కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాధాన్యతను వివరించారు. అనంతరం విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా డా. కొణతాల రామలింగస్వామి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కొణతాల లక్ష్మీ పార్వతి విరాళంగా అందించిన “సేవ్ ఎర్త్” విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. పాఠశాల కమిటీ చైర్మన్ అరెగల శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు కె.ఎన్. మూర్తి, బి.వై.వై.ఎస్. కృష్ణారావు, పి. జయశ్రీ, ఎస్. సుజాత, జి. ఉమా, డి. శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు. “ఓజోన్‌ను కాపాడుదాం–భూమిని రక్షిద్దాం” అంటూ నినాదాలు చేశారు.

అనకాపల్లి

మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ సమర సన్నాహాలు

ఎలమంచిలి, సెప్టెంబర్ 15 – పున్నమి ప్రతినిధి ఆనంద్: రాబోయే ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని పార్టీ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ) అధ్యక్షతన వార్డుల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి వార్డులో పార్టీ బలాబలాలు, ఓటర్ల నమోదు, స్థానిక సమస్యలు, చేరికలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చలపతిరావు సూచించారు. మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగురవేసేలా సమన్వయంతో పనిచేయాలని ప్రగడ నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నానాజీ కోరారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

సెప్టెంబర్‌ 29న పాఠశాలల SMC ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్‌ 15 – పున్నమి న్యూస్‌ రిపోర్టర్‌ ఆనంద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (SMC)ల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు SMC ఎన్నికల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెప్టెంబర్‌ 15న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా, సెప్టెంబర్‌ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తుది జాబితా ప్రకటించనున్నారు. సెప్టెంబర్‌ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు SMC ఎన్నికలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు పర్యవేక్షించనున్నారు.

అనకాపల్లి

వైసీపీ శ్రేణుల్లో జోష్.. యలమంచిలిలో సమర శంఖం

యలమంచిలి , సెప్టెంబర్ 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ): యలమంచిలి నియోజకవర్గం నారాయణపురం కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం వైసీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, కరణం ధర్మశ్రీ, కొరసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వందలాది మంది కార్యకర్తల మధ్య ‘జై జగనన్న’ నినాదాలు మార్మోగాయి. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలను తుంగలో తొక్కిందని కొరసాల కన్నబాబు విమర్శించారు. కనిగిరికొండ పరిరక్షణ కోసం వైసీపీ పోరాటం చేసి ప్రభుత్వం వెనక్కి తగ్గేలా చేసిందని పెట్ల గణేష్ అన్నారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి కార్యకర్త పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఎస్సై ఉపేంద్ర పల్లెనిద్ర.. ప్రజలకు భరోసా, యువతకు హెచ్చరిక..!

యలమంచిలి, సెప్టెంబర్ 14 – పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్: ఏటికొప్పాక గ్రామంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిబంధనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై ఉపేంద్ర హెచ్చరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకునేందుకు పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఎస్సై ఉపేంద్రతో పాటు పోలీసు సిబ్బంది చురుకుగా పాల్గొని ప్రజలకు పలు సూచనలు, హెచ్చరికలు చేశారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. 12 అడుగుల గణనాథుడికి ప్రత్యేక పూజలు..!

స్మైలీ గాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన.. భక్తులతో సందడిగా ఏటికొప్పాక యలమంచిలి , సెప్టెంబర్ 15: పున్నమి ప్రతినిధి ఆనంద్ ఏటికొప్పాక గ్రామంలోని కుమ్మరి వీధిలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. స్మైలీ గాయ్స్ యూత్ ఆధ్వర్యంలో 12 అడుగుల భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రతిష్ఠాపన చేశారు. భారీ గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విఘ్నేశ్వరుడి దర్శనం కోసం స్థానికులు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణపతి నామస్మరణతో కుమ్మరి వీధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్మైలీ గాయ్స్ యూత్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

అనకాపల్లి

రైలు కిందకు దూకి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్

తుని (అనకాపల్లి), సెప్టెంబర్ 14 – పున్నమి ప్రతినిధి ఆనంద్: రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు (HC-496) మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖపట్నం నుంచి అలప్పీ వెళ్తున్న ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ తుని రైల్వే స్టేషన్ వద్ద నెమ్మదిగా కదులుతుండగా ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే క్రమంలో అదుపుతప్పి బోగీ కింద పట్టాలపై పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన చంద్రరావు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బోగీ కిందకు వెళ్లి పట్టాల మధ్య చిక్కుకున్న ప్రయాణికుడిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు సాహసాన్ని ఎలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేందర్ అభినందించారు. ఈ సాహసోపేత సేవలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గుర్తించి నగదు రివార్డు, ప్రశంసా పత్రం అందజేశారు.

అనకాపల్లి

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సమరసన్నద్ధం కావాలి

ఎలమంచిలి, సెప్టెంబర్ 15, పున్నమి ప్రతినిధి ఆనంద్: రాబోయే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని యలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తనకాల అనంతరావు పిలుపునిచ్చారు. యలమంచిలి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదల, మంచినీటి సమస్య, విద్యుత్ కోతలు, గ్రామాల్లో బెల్ట్‌షాపులు, గంజాయి కార్యకలాపాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ నెల 17న యలమంచిలిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు బొడ్డూ శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు రావి రామసత్యం, నాగు మంత్రి సాయి, సుందరపు ఈశ్వరరావు, మేరుగు అచ్చిబాబు, కంకణాలు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డి రవి అధ్యక్షత వహించారు.

అనకాపల్లి

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడే ముద్దు.. ఏటికొప్పాకలో భక్తులకు ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ

యలమంచిలి , సెప్టెంబర్ 13: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఏటికొప్పాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు అగ్రహారపు కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం బండి మాంబ ఆలయ ఆవరణలో ఆలయానికి విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమార్ స్వామి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలను పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రసాయన రంగులతో తయారైన విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరిగే అవకాశం ఉన్నందున మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

పేకాట స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్, రూ.9,060 నగదు స్వాధీనం

బుచ్చయ్యపేట, సెప్టెంబర్ 13: ​పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి.కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో బుచ్చయ్యపేట పోలీసులు పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ​శనివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుచ్చయ్యపేట ఎస్సై పి.మనోజ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బుచ్చయ్యపేట మండలం, బంగారుమెట్ట గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పందెంగా కాసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ​వారి వద్ద నుంచి రూ.9,060/- నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ​మండల పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.