Sunday, 27 September 2026

Tag: విశాఖపట్నం పున్నమి న్యూస్

విశాఖపట్నం

పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేనలోకి 40 కుటుంబాలు

నెల్లిమర్ల: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం తుడెం గ్రామానికి చెందిన సుమారు 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో నీలాపు రామచంద్రరెడ్డి, గాలి పోలిరెడ్డి, దువ్వు వెంకటరమణ తదితరులు తమ అనుచరులతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం

విశాఖపట్నం: సాగర్‌నగర్‌లోని శిక్షణ కేంద్రంలో ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులకు “ఒత్తిడి, సమయ నిర్వహణ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు” అనే అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యాలయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యల పరిష్కారం, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మారడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఒత్తిడి నిర్వహణ, బృందంగా పనిచేయడం, ఉత్పాదకత పెంపుపై ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు అని ముత్యాల బాలాజీ పేరూకున్నారు

విశాఖపట్నం

బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్‌ను కలిసిన అంగ దుర్గా ప్రశాంతి

విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నబిన్‌ను ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంగ దుర్గా ప్రశాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో విశాఖ నగర అభివృద్ధి, పశ్చిమ నియోజకవర్గ సమస్యలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

విశాఖపట్నం

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలని, ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసి 100 శాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని నగర అధ్యక్షులు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ పరిధి ఇన్‌చార్జిలు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ప్రతి వార్డులో ఘనంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని, జీవీఎంసీలో 120 వార్డులకు సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, మేయర్ ఎన్నికకు ప్రత్యేక వ్యూహంతో వెళ్తామని, నవంబర్ 20 లోపు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

విశాఖపట్నం

విశాఖలో సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వాగతం*

విశాఖపట్నం: బ్రిక్స్ సమావేశానికి విశాఖ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన విశాఖ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే వంశీకృష్ణను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలను వంశీకృష్ణ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఉయ్యూరులో డయేరియా.. మంత్రి నారాయణ పర్యటన*

ఉయ్యూరు, ఆగస్టు 21: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ 5, 7 వార్డుల్లో డయేరియా ప్రబలడంతో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. స్థానికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. డయేరియా కారణాలపై నీటి శాంపిల్స్ టెస్టింగ్‌కు పంపామని, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.

విశాఖపట్నం

అగనంపూడిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు*

విశాఖ: పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు అగనంపూడిలో ఘనంగా జరిగాయి. చిరంజీవి యువత అధ్యక్షులు విందుల చిరు రాజు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పెదమడక శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో చిరంజీవి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గాజువాక జనసేన సీనియర్ నాయకులు విందుల వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విశాఖపట్నం

87వ వార్డులో స్వర్ణఆంధ్ర స్వచ్ఆంధ్ర కార్యక్రమం… ముఖ్య అతిధులుగా మాజీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం

గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి వడ్లపూడి ఆర్ హెచ్ సి కణితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం పి హెచ్ సి వైద్యులు కె. స్వరూపరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాల్లో శుభ్రపరచడం జరిగింది. అనంతరం ప్రతి నెలా మూడో శనివారం దీన్ని నిర్వహిస్తారని.ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం, తడి-పొడి చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం దీని దిని ప్రధాన లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్,పావాడ వెంకటరమణమూర్తి,కడుపుట్ల శ్రీను,జాన్ రమేష్,దాలయ్య, మూర్తి, ఆదినారాయణ,కె.

విశాఖపట్నం

రాజస్థాన్‌లో విశాఖ డీసీబీ చైర్మన్ పర్యటన

జైపూర్: రాజస్థాన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆహ్వానం మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా డీసీబీ చైర్మన్ కోన తాతారావు జైపూర్‌లో పర్యటించారు. రాజస్థాన్‌లోని కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరు, రైతులకు పంట రుణాలపై ప్రోత్సాహకాలు, అర్బన్ వ్యాపార రుణాలు, నిరుద్యోగ యువతకు సబ్సిడీ పథకాల అమలును పరిశీలించారు. NABARD, NCDC ద్వారా అందే నిధుల వినియోగంపై బ్యాంక్ ఉన్నతాధికారులతో చర్చించారు. MD RC చుందావత్, GM PK నాగ్, DGM రుచి శర్మతో భేటీ అయ్యారు. రాజస్థాన్ మంచి పథకాలను ఏపీలో అమలు చేయాలని నిర్ణయించార

విశాఖపట్నం

AP శాసనసభలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు

*ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శన భాగ్యం* ఆంధ్రా యూనివర్సిటీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమరావతి వెళ్లి ఏపీ శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కలిసి శాలువాతో సత్కరించారు. శాసనసభ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చలు, ప్రజాస్వామ్య పాలనా విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్పీకర్‌తో ఫొటోలు దిగారు. ఈ అనుభవం తమ విద్యాభ్యాసంతో పాటు భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యువతకు ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి పర్యటనలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ప్రొఫెసర్ ప్రేమానందం, అధ్యాపకులు నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.