ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం రేణమాల గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో “గడప గడపకు బీఎస్పీ” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని, సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచేందుకు నాయకులు గట్టి ప్రయత్నం చేశారు. బహుజనుల హక్కులు, రాజ్యాంగం కల్పించిన అవకాశాలపై ప్రజలకు వివరించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జి క్రాకుటూరు పుష్పాంజలి, జిల్లా కార్యదర్శి బెజవాడ ప్రకాశరావు, జిల్లా బీవీఎఫ్ కన్వీనర్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిపై చర్చించారు.

రేణమాలలో గడప గడపకు బీఎస్పీ