కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామపంచాయతీ.పరిధిలోని కుడుములదిన్నేపాడులో శుక్రవారం కుక్కకాటుకు గురైన కావా విజయమ్మ, మన్నం మనీషా, బండారు నాగేశ్వరరావు, తన్నీరు రమేష్, తన్నీరు శ్రీనివాసులు, తన్నీరు నరసింహ, మల్లె ప్రసన్న లను ఎంపీడీవో కే. ప్రత్యూష, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది శనివారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనల మేరకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామంలో సంచరిస్తున్న కుక్కలను గుర్తించి పట్టుకోవడంతో పాటు అవసరమైన వ్యాక్సినేషన్ చేయించేందుకు పంచాయతీ అధికారులతో సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.డాక్టర్.ఆకాష్ మాట్లాడుతూ కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బయన్న, రాజశేఖర్ హెల్త్ అసిస్టెంట్ ఎన్.ఎల్. ప్రసాద్, ఎంఎలెచ్పీ ప్రఖ్యాతి, ఏఎన్ఎం మమత, ఆశా కార్యకర్త మాలతి,టీడీపీ నాయకులు డబ్బుగుంట మాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు

కుక్కకాటుకు గురైన బాధితులకు ఎంపీడీవో పరామర్శ