Sunday, 27 September 2026
  • Home  
  • అరకు పైనరీకి రాష్ట్రస్థాయి అవార్డు
- అల్లూరి సీతారామరాజు

అరకు పైనరీకి రాష్ట్రస్థాయి అవార్డు

అరకు, సెప్టెంబర్ 26: అరకు పైనరీకి రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. 2026 సంవత్సరానికి గాను “ఉత్తమ చలనచిత్ర చిత్రీకరణ ప్రదేశం” విభాగంలో అరకు పైనరీని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని అరకు అటవీ రేంజ్ అధికారి బి.కోటేశ్వరరావు, పైనరీ ఇన్‌చార్జి శేఖర్ తెలిపారు. పైనరీలోని సహజ సౌందర్యం, ఏకో టూరిజం కార్యక్రమాలు, సినిమాల చిత్రీకరణకు అనుకూలమైన వాతావరణం కారణంగా ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు తెలుగు, హిందీ చిత్రాల షూటింగ్‌లు పైనరీ పరిసరాల్లో జరిగాయని తెలిపారు. ఈ అవార్డు అటవీశాఖతో పాటు స్థానిక ప్రజలకు కూడా గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో ఉన్నతాధికారుల సూచనలు, సహకారంతో పైనరీని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులు, చిత్ర పరిశ్రమకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపడతామన్నారు. అవార్డును ఆదివారం ఘనంగా స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ గుర్తింపుతో అరకు ప్రాంతానికి పర్యాటక ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.