Sunday, 27 September 2026

Tag: బ్రేకింగ్ న్యూస్

రంగారెడ్డి

హార్దికర్ ఆశయాలే స్ఫూర్తిగా.. సేవే మా సంకల్పం ఘనంగా డాక్టర్ ఎన్.ఎస్. హార్దికర్ వర్ధంతి వేడుకలు

హార్దికర్ ఆశయాలే స్ఫూర్తిగా.. సేవే మా సంకల్పం ఘనంగా డాక్టర్ ఎన్.ఎస్. హార్దికర్ వర్ధంతి వేడుకలు కూలీలు, వృద్ధులు, వికలాంగులకు అల్పాహారం.. 300 మందికి అన్నప్రసాదం తుర్కయంజాల్, ఆగస్టు 26: దేశసేవ, ప్రజాసేవ, యువజన చైతన్యానికి జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎన్.ఎస్. హార్దికర్ వర్ధంతిని పురస్కరించుకుని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. హార్దికర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగంగా కూలీలు, వికలాంగులు, వృద్ధులకు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేశారు. అనంతరం సికింద్రాబాద్ చిలకలగూడ బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు, డ్రైవర్లు, మహిళలు, నిరుపేదలకు సుమారు 300 మందికి బిర్యానీ భోజన ప్రసాదాన్ని అందించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి లిక్కి వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హార్దికర్ చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడమే నిజమైన నివాళి అని అన్నారు. ప్రజాసేవే పరమ ధర్మమనే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. హార్దికర్ ఆశయాల వెలుగులో.. ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం, వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం, కష్టజీవులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలే హార్దికర్ ఆశయాలకు నిజమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. సేవాదళ్ స్ఫూర్తితో ప్రజల మధ్య ఉంటూ సేవే శ్వాసగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. లిక్కి వెంకట్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 300 మందికి అన్నప్రసాదం అందించడం ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. హార్దికర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకువస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

రంగారెడ్డి

కంకర పోసి నాలుగు నెలలు.. రోడ్డు ఎప్పుడు వేస్తారు?

కంకర పోసి నాలుగు నెలలు.. రోడ్డు ఎప్పుడు వేస్తారు? పిచ్చి మొక్కలతో రహదారి అధ్వానంగా.. ఇళ్లలోకి పాములు వస్తున్నాయని గ్రామస్తుల ఆవేదన యాచారం, ఆగస్టు 26 (పున్నమి న్యూస్): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీలో రహదారి పనుల పరిస్థితి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. రోడ్డు నిర్మాణం కోసం సుమారు నాలుగు నెలల క్రితం రోడ్డుపై కంకర పోసినప్పటికీ, ఇంతవరకు తారు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కంకర పోసిన రహదారి ప్రస్తుతం పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది. నాలుగు నెలలు గడుస్తున్నా రహదారి నిర్మాణ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు వేస్తారా..? వేయరా..? అనే అయోమయంలో గ్రామ ప్రజలు ఉన్నారు. కంకరపై వాహనాలు వెళ్లడంతో దుమ్ము లేచి ఇబ్బందులు పడటంతో పాటు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రహదారిపై పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో పరిసర ప్రాంతం పూర్తిగా అపరిశుభ్రంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి మొక్కలు, పొదలు పెరగడంతో విషపురుగులు, పాములు సంచరిస్తున్నాయని, రాత్రి వేళల్లో ఇళ్లలోకి పాములు వస్తున్న ఘటనలు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు కనీసం రహదారి వెంట పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్పంచ్ స్పందించి సఫాయి సిబ్బందితో పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు నిత్యం ఉపయోగపడే ప్రధాన రహదారి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయకూడదని గ్రామస్తులు అంటున్నారు. కంకర వేసి నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రహదారి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? కంకర పోసి నాలుగు నెలలు కావస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతోంది? అనే విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రహదారిని పరిశీలించి, పిచ్చి మొక్కలు తొలగించడంతో పాటు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.

రంగారెడ్డి

మురుగు ముంపులో మునగనూరు..!

మురుగు ముంపులో మునగనూరు..! చెత్త, మురుగునీటితో నరకాన్ని తలపిస్తున్న రహదారులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకునేవారేరీ? తుర్కయంజాల్ సర్కిల్, ఆగస్టు మునగనూరు ప్రజలకు పారిశుద్ధ్య సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్త, రోజుల తరబడి నిలిచిపోయిన మురుగునీటితో గ్రామ పరిసరాలు అధ్వానంగా మారాయి. మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రహదారులపైకి చేరుతోంది. దుర్వాసనతో పాటు దోమల బెడద పెరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని పాలకులు.. ఆవేదనలో ప్రజలు పారిశుద్ధ్య సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించకపోవడం, డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్ల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని చెబుతున్నారు. వర్షం వస్తే పరిస్థితి మరింత దారుణం వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. మురుగు నిల్వల కారణంగా దోమలు పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనాలి గ్రామపంచాయతీ నుంచి గ్రేటర్ అధికారుల వరకు సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే మునగనూరులో క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

రంగారెడ్డి

₹100 కోట్ల క్లబ్‌లో రవితేజ ‘ఇరుముడి’

₹100 కోట్ల క్లబ్‌లో రవితేజ ‘ఇరుముడి’ తండ్రి–కూతురు అనుబంధానికి ప్రేక్షకుల బ్రహ్మరథం మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తండ్రి–కూతురు అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రవితేజ కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తున్న ‘ఇరుముడి’లో కుటుంబ భావోద్వేగాలు, తండ్రి–కూతురు మధ్య అనుబంధం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రవితేజను కొత్త తరహా భావోద్వేగ పాత్రలో చూపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు కూడా వేగంగా పెరిగినట్లు సినీ వర్గాల సమాచారం. తండ్రి–కూతురు బంధంలోని ప్రేమ, అనుబంధం, భావోద్వేగాలను తెరపై అందంగా ఆవిష్కరించడం ‘ఇరుముడి’కి ప్రధాన బలంగా మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రవితేజ అభిమానుల్లోనూ, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ సినిమాపై క్రేజ్ పెరుగుతోంది. రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’ చేరడంతో రవితేజ కెరీర్‌లో మరో భారీ విజయంగా ఈ చిత్రం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మరింతగా పెరుగుతాయా? అన్నది ఆసక్తిగా మారింది.

రంగారెడ్డి

రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. వరుస సెలవులతో విద్యార్థులకు జాలీ!

రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. వరుస సెలవులతో విద్యార్థులకు జాలీ! రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. వరుస సెలవులతో విద్యార్థులకు జాలీ! ఆగస్టు 26న మిలాద్ ఉన్ నబీ.. 28న రాఖీ పౌర్ణమి హైదరాబాద్: విద్యార్థులకు వరుస సెలవులు రావడంతో పాఠశాలలు, కళాశాలలకు కొద్దిరోజుల పాటు విరామం లభించనుంది. మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ఆగస్టు 26న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో బుధవారం పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు వర్తించనుంది. మిలాద్ ఉన్ నబీని ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరోజు విరామం పొందనున్నారు. రెండు రోజులు సెలవులు ఆగస్టు 26న మిలాద్ ఉన్ నబీ సెలవు అనంతరం ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా మరో సెలవు ఉంది. దీంతో విద్యార్థులకు ఈ వారం ప్రత్యేకంగా సెలవుల వాతావరణం ఏర్పడింది. పండుగల కారణంగా వచ్చే సెలవులతో పాటు వారాంతపు సెలవులు కూడా కలిసివస్తుండటంతో పలువురు విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ కట్టే సంప్రదాయం ఉంది. దీంతో ఈ పండుగను పురస్కరించుకుని కూడా విద్యార్థులు తమ బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విద్యార్థుల్లో ఆనందం వరుసగా సెలవులు రావడంతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సెలవులను కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు విద్యార్థులు పర్యటనలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, మరికొందరు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగలు, సెలవులు ఒకదాని తర్వాత ఒకటి రావడంతో బస్సులు, రైళ్లు, ఇతర రవాణా మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా స్వగ్రామాలకు వెళ్లే కుటుంబాలు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఐటీ ఉద్యోగులకు కూడా లాంగ్ వీకెండ్ విద్యార్థులతో పాటు ఐటీ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ సెలవులు కలిసి వస్తున్నాయి. పండుగ సెలవులకు వారాంతపు సెలవులు జత కావడంతో కొందరికి లాంగ్ వీకెండ్‌గా మారనుంది. దీంతో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు లేదా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మొత్తంగా మిలాద్ ఉన్ నబీ, రాఖీ పౌర్ణమి సెలవులు వరుసగా రావడంతో విద్యార్థులు, ఉద్యోగుల్లో పండుగ సందడి నెలకొంది. పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యే తేదీకి సంబంధించి ఆయా విద్యాసంస్థలు తమ షెడ్యూల్ ప్రకారం తరగతులను నిర్వహించనున్నాయి.

రంగారెడ్డి

ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాలె అనిత–రమేష్

ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాలె అనిత–రమేష్ రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి యాచారం, ఆగస్టు 25: ఉప సర్పంచ్‌ల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం కొత్తపల్లి గ్రామ ఉప సర్పంచ్ కాలె అనిత–రమేష్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ లావుడ్య రాములు నాయక్ కాలె అనిత–రమేష్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కాలె అనిత–రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లావుడ్య రాములు నాయక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉప సర్పంచ్‌లకు ప్రభుత్వం కల్పించాల్సిన హక్కులు, అధికారాలు, గౌరవం తదితర అంశాలపై సంఘం తరఫున బలంగా పోరాడుతామని తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్‌లను సంఘటితం చేసి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే ఉప సర్పంచ్‌ల సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, ఉప సర్పంచ్‌లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యంగా ముందుకు సాగేందుకు తన వంతు కృషి చేస్తానని కాలె అనిత–రమేష్ తెలిపారు. కాలె అనిత–రమేష్‌కు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు దక్కడం పట్ల కొత్తపల్లి గ్రామ ప్రజలు, ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్‌ల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం – జై ఉప సర్పంచ్‌లు – జై తెలంగాణ

రంగారెడ్డి

బ్లాక్ కాఫీలో బొద్దింక.. కస్టమర్‌కు చేదు అనుభవం

బ్లాక్ కాఫీలో బొద్దింక.. కస్టమర్‌కు చేదు అనుభవం మన్నెగూడలోని చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సెంటర్‌లో ఘటన — పరిశుభ్రతపై వినియోగదారుల ఆగ్రహం ఇబ్రహీంపట్నం: జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని మన్నెగూడలో ఉన్న చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సెంటర్‌లో ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసిన ఓ వినియోగదారుడికి కాఫీలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిపారు. కస్టమర్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్లాక్ కాఫీ నల్లగా ఉండటంతో కాఫీ తాగే వరకు అందులో ఏదైనా ఉన్న విషయం గుర్తించలేదని, కాఫీ పూర్తిగా తాగిన అనంతరం కప్పు అడుగున బొద్దింక కనిపించడంతో ఆందోళనకు గురైనట్లు చెప్పారు. ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, తాము కాఫీ సెంటర్‌ను పరిశుభ్రంగానే నిర్వహిస్తున్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు కస్టమర్ ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. “మెనూలో ధరలు పెంచడంపై ఉన్న శ్రద్ధ హోటల్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై ఎందుకు లేదు? బొద్దింక స్థానంలో బల్లి పడి ఉంటే పరిస్థితి ఏమిటి?” అంటూ ప్రశ్నించారు. ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. హోటళ్లు, కాఫీ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులు స్పందించి సంబంధిత కాఫీ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

రంగారెడ్డి

బ్లాక్ కాఫీలో బొద్దింక.. కస్టమర్‌కు చేదు అనుభవం

బ్లాక్ కాఫీలో బొద్దింక.. కస్టమర్‌కు చేదు అనుభవం మన్నెగూడలోని చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సెంటర్‌లో ఘటన — పరిశుభ్రతపై వినియోగదారుల ఆగ్రహం ఇబ్రహీంపట్నం: జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని మన్నెగూడలో ఉన్న చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సెంటర్‌లో ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసిన ఓ వినియోగదారుడికి కాఫీలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిపారు. కస్టమర్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్లాక్ కాఫీ నల్లగా ఉండటంతో కాఫీ తాగే వరకు అందులో ఏదైనా ఉన్న విషయం గుర్తించలేదని, కాఫీ పూర్తిగా తాగిన అనంతరం కప్పు అడుగున బొద్దింక కనిపించడంతో ఆందోళనకు గురైనట్లు చెప్పారు. ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, తాము కాఫీ సెంటర్‌ను పరిశుభ్రంగానే నిర్వహిస్తున్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు కస్టమర్ ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. “మెనూలో ధరలు పెంచడంపై ఉన్న శ్రద్ధ హోటల్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై ఎందుకు లేదు? బొద్దింక స్థానంలో బల్లి పడి ఉంటే పరిస్థితి ఏమిటి?” అంటూ ప్రశ్నించారు. ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. హోటళ్లు, కాఫీ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులు స్పందించి సంబంధిత కాఫీ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

రంగారెడ్డి

బండలేమూర్‌లో అంత్యక్రియలకు మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం

బండలేమూర్‌లో అంత్యక్రియలకు మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబానికి అండగా రూ.5 వేల ఆర్థిక సాయం మంచాల: మండలంలోని బండలేమూర్ గ్రామానికి చెందిన రమావత్ పత్తి ఆదివారం (23-08-2026) తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, 1వ వార్డు సభ్యుడు శిరీష చందు తన బృందంతో కలిసి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బండలేమూర్ మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. పత్తి మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరితో మర్యాదగా మెలిగే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తమ మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మంగ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబాల కష్టాలను గుర్తించి, వారికి తన వంతు సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. పేద కుటుంబాలకు మరింత సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యుడు శిరీష చందు, తుల్జా భవాని యూత్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ యువ నాయకుడు సభావట్ లచ్చిరాం, కాంగ్రెస్ యువ నాయకుడు రమావత్ నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాతులోత్ నాను నాయక్, పాతులోత్ తావు నాయక్, సభావట్ జగ్గు, రమావత్ మంగ్త నాయక్ తదితరులు పాల్గొని మృతుడికి నివాళులర్పించారు.

రంగారెడ్డి

సీఎం సార్ మాగోడు వినండి..! — బుడగ జంగాల మహిళ ఆవేదన

సీఎం సార్ మాగోడు వినండి..! — బుడగ జంగాల మహిళ ఆవేదన ప్రభుత్వం కేటాయించిన 90 గజాల స్థలంలో గుడిసె వేసుకుని జీవనం.. అధికారులు అకారణంగా ఖాళీ చేయిస్తున్నారని దంపతుల ఆరోపణ ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని అధికారిపై ఆరోపణ మంత్రి ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ ఆమనగల్లు: ప్రభుత్వం కేటాయించిన 90 గజాల స్థలంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్న తమను అకారణంగా అక్కడి నుంచి వెళ్లగొడుతున్నారని బుడగ జంగాల వర్గానికి చెందిన బేబీ, లక్ష్మయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన స్థలంలోనే నివాసం ఉంటున్నప్పటికీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని దంపతులు వాపోయారు. తమకు న్యాయం చేయాల్సిన అధికారులు సమస్యను పరిష్కరించకుండా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమనగల్లులో ఓ అధికారి తమ సమస్యను పరిష్కరించేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని బేబీ ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. తమ సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలంలో ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని కోరారు. సీఎం స్పందించి న్యాయం చేయాలి నిరుపేదలమైన తమపై అధికారులు వేధింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని, తమకు కేటాయించిన 90 గజాల స్థలంపై రక్షణ కల్పించాలని బేబీ, లక్ష్మయ్య దంపతులు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి తమ గోడును విని, సంబంధిత అధికారులపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని పున్నమి న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేశారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.