Thursday, 27 August 2026
  • Home  
  • కంకర పోసి నాలుగు నెలలు.. రోడ్డు ఎప్పుడు వేస్తారు?
- రంగారెడ్డి

కంకర పోసి నాలుగు నెలలు.. రోడ్డు ఎప్పుడు వేస్తారు?

కంకర పోసి నాలుగు నెలలు.. రోడ్డు ఎప్పుడు వేస్తారు? పిచ్చి మొక్కలతో రహదారి అధ్వానంగా.. ఇళ్లలోకి పాములు వస్తున్నాయని గ్రామస్తుల ఆవేదన యాచారం, ఆగస్టు 26 (పున్నమి న్యూస్): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీలో రహదారి పనుల పరిస్థితి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. రోడ్డు నిర్మాణం కోసం సుమారు నాలుగు నెలల క్రితం రోడ్డుపై కంకర పోసినప్పటికీ, ఇంతవరకు తారు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కంకర పోసిన రహదారి ప్రస్తుతం పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది. నాలుగు నెలలు గడుస్తున్నా రహదారి నిర్మాణ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు వేస్తారా..? వేయరా..? అనే అయోమయంలో గ్రామ ప్రజలు ఉన్నారు. కంకరపై వాహనాలు వెళ్లడంతో దుమ్ము లేచి ఇబ్బందులు పడటంతో పాటు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రహదారిపై పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో పరిసర ప్రాంతం పూర్తిగా అపరిశుభ్రంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి మొక్కలు, పొదలు పెరగడంతో విషపురుగులు, పాములు సంచరిస్తున్నాయని, రాత్రి వేళల్లో ఇళ్లలోకి పాములు వస్తున్న ఘటనలు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు కనీసం రహదారి వెంట పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్పంచ్ స్పందించి సఫాయి సిబ్బందితో పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు నిత్యం ఉపయోగపడే ప్రధాన రహదారి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయకూడదని గ్రామస్తులు అంటున్నారు. కంకర వేసి నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రహదారి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? కంకర పోసి నాలుగు నెలలు కావస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతోంది? అనే విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రహదారిని పరిశీలించి, పిచ్చి మొక్కలు తొలగించడంతో పాటు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.

కంకర పోసి నాలుగు నెలలు.. రోడ్డు ఎప్పుడు వేస్తారు?

పిచ్చి మొక్కలతో రహదారి అధ్వానంగా.. ఇళ్లలోకి పాములు వస్తున్నాయని గ్రామస్తుల ఆవేదన

యాచారం, ఆగస్టు 26 (పున్నమి న్యూస్):
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీలో రహదారి పనుల పరిస్థితి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. రోడ్డు నిర్మాణం కోసం సుమారు నాలుగు నెలల క్రితం రోడ్డుపై కంకర పోసినప్పటికీ, ఇంతవరకు తారు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కంకర పోసిన రహదారి ప్రస్తుతం పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది.

నాలుగు నెలలు గడుస్తున్నా రహదారి నిర్మాణ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు వేస్తారా..? వేయరా..? అనే అయోమయంలో గ్రామ ప్రజలు ఉన్నారు. కంకరపై వాహనాలు వెళ్లడంతో దుమ్ము లేచి ఇబ్బందులు పడటంతో పాటు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా రహదారిపై పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో పరిసర ప్రాంతం పూర్తిగా అపరిశుభ్రంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి మొక్కలు, పొదలు పెరగడంతో విషపురుగులు, పాములు సంచరిస్తున్నాయని, రాత్రి వేళల్లో ఇళ్లలోకి పాములు వస్తున్న ఘటనలు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు కనీసం రహదారి వెంట పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్పంచ్ స్పందించి సఫాయి సిబ్బందితో పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజలకు నిత్యం ఉపయోగపడే ప్రధాన రహదారి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయకూడదని గ్రామస్తులు అంటున్నారు. కంకర వేసి నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రహదారి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.

రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? కంకర పోసి నాలుగు నెలలు కావస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతోంది? అనే విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రహదారిని పరిశీలించి, పిచ్చి మొక్కలు తొలగించడంతో పాటు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.