SIR ఓటర్ వెరిఫికేషన్‌ను 100% పూర్తి చేసిన బూత్ కన్వీనర్ నాటకరాణి వెంకట్‌కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
తెలుగుదేశం పార్టీ మై TDP యాప్ ద్వారా
నిర్వహించిన SIR ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని
100 శాతం విజయవంతంగా పూర్తి చేసినసందర్భంగా, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు గ్రామపంచాయతీ పరిధిలోని 135వ బూత్ కన్వీనర్ నాటకరాణి వెంకట్ గారిని ప్రత్యేకంగా అభినందించారు.
పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

