నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్ లోని ఆయన నివాసంలో ఆయన నిద్ర లేవక ముందే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.భీంగల్ లో 70 శాతం బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన పెండింగ్ పనులైన 100 పడకల ఆసుపత్రి, మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిచెయాలని ప్రశాంత్ రెడ్డి భీంగల్ లో నిరాహార దీక్ష చేపట్టినున్న సందర్భంగా పోలీసుల ముదస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.మాజీ మంత్రి ఎమ్మెల్యేవేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నన్ను అరెస్టు చేసినంత మాత్రాన నేను గృహనిర్బంధంలో ఉన్నంత మాత్రాన దీక్ష ఆగదనినేను అనుకున్న దాన్ని నా ఇంటి ముందు నిర్వహిస్తానని అదేవిధంగా కార్యకర్తలనుకూడా దీక్ష శిబిరానికి రాకుండా అరెస్టు చేయడం సరైనది కాదని ఈరోజు ఈ అరెస్టుల పర్వాన్ని బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ చూస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి అరెస్టులు గృహనిబంధాలుఎన్నో అనుభవించి తెచ్చుకున్న తెలంగాణనుప్రజలకు అండగా నిలవాలని ఈ కార్యక్రమం నిర్వహించాల అని నా బాల్కొండ నియోజకవర్గప్రజల కొరకు నేను అనుకున్న అందుకు నా ఒక్కడితో ఈ ఉద్యమంఆగదని దీనికి మీరే మేము ముందుకు పోయే దారులు చూపిస్తున్నారు అని ఆయన అన్నారు.ఈ ధర్నా నేను చేసేది ప్రజలకు ఇబ్బంది కలగకుండా దీక్ష చేపడుతున్నానని ఆ దీక్ష సమయంలో ఏదైనా తప్పు జరిగిన దానికి ఎలాంటి చట్టపరమైన చర్యలకు నేను నా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.



