మాజీ మంత్రి , ఉద్యమ నాయకుడు, ప్రజా నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆకస్మిక నిర్యాణం పట్ల ప్రముఖ విద్యాసంస్థల అధినేత , కిమ్స్ వైద్య కళాశాల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు.
ముద్రగడ సమాధిని సందర్శించి, పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ముద్రగడతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని, ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన పోషించిన విశిష్ట పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. చైతన్య రాజు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతుడైన నిజాయితీ పరుడైన నాయకుడని ఆయన సేవలు చిరస్మరణీయమని, ఆయన రూపం ప్రజల గుండెల్లో నిరంతరం స్పందిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు మహానుభావుల కు నివాళులర్పించడం మన సంస్కృతికి ప్రతీక అని ఆయన అన్నారు.
అనంతరం, ముద్రగడ వారసులు, ప్రత్తిపాడు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబుని, ముద్రగడ బాలు నికుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు .



